Headlines

Petrol Prices: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం షాకింగ్ డెసిషన్.. మరోసారి పెంపు.. నేటి నుంచే అమల్లోకి..

Petrol Prices: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం షాకింగ్ డెసిషన్.. మరోసారి పెంపు.. నేటి నుంచే అమల్లోకి..


Petrol Prices: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం షాకింగ్ డెసిషన్.. మరోసారి పెంపు.. నేటి నుంచే అమల్లోకి..

పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విండ్ ఫాల్ ట్యాక్స్ మరోసారి పెంచింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్స్ పెంచింది. ఆగస్ట్ 3వ తేదీ నుంచి ఈ కొత్త ట్యాక్సులు అమల్లోకి రానున్నట్లు కేంద్రం ప్రకటించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతూ సాధారణ స్థితికి వస్తున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పడిపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం విండ్ ఫాల్ ట్యాక్స్ పెంచడం చర్చనీయాంశంగా మారింది. ఏ ఇంధనంపై ఎంత పెంచారు అనేది ఇప్పుడు చూద్దాం.

పెట్రోల్, డీజిల్‌పై ఎంత పెంచారంటే..?

ఎగుమతి సుంకాన్ని లీటర్ డీజిల్‌పై రూ.15.50 నుంచి రూ.24కు పెంచారు. ఇక పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2.50 నుంచి రూ.3.50కు పెంచారు. అలాగే రిఫైనరీలు విదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేసి పొందే అదనపు లాభాలపై లీటరుకు రూ.24 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం విధించనున్నట్లు తెలిపింది. అలాగే పెట్రోల్‌పై లీటరుకు రూ.3.50కి చేరుకుంది. ఇక విమాన ఇంధనంపై కూడా ఎగుమతి సుంకాలను సవరిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే కేంద్రం ఎగుమతి సుంకాలపై ప్రతీ 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తూ ఉంటుంది. ఈ సమీక్షల్లో భాగంగా సవరణలు చేస్తూ ఉంటుంది. అంతర్జాతీయ పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులు, ముడి చమురు ధరలు, ఎగుమతి మార్జిన్ల ఆధారంగా పన్ను రేట్లను ప్రభుత్వం మారుస్తూ ఉంటుంది. గత నెలలో కూడా పెంచగా.. ఇప్పుడు మరోసారి పెంచింది. దేశం నుంచి విదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేసేవారిపై ఈ భారం పడనుంది. దేశీయంలో దీని వల్ల పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవు.

ధరల్లో మార్పుల్లేవ్..

అయితే అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన సమయంలో రిఫైనర్లు అధిక లాభాలను పొందుతారు. ఇలాంటి సమయంలో పెట్రోలియం ఉత్పత్తులపై విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తూ ఉంటారు. ఇక సోమవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పుుల జరగలేదు. ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు ఇంధన కంపెనీలు కొత్త ధరలను ప్రకటిస్తూ ఉంటాయి. సోమవారం ప్రకటించిన ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.73గా ఉండగా.. డీజిల్ రూ.103.82 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.116.64 వద్ద కొనసాగుతోండగా.. డీజిల్ ధర రూ.104.34గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *