Headlines

ఇది తెలుసా.. తొలుత పాక్ జెర్సీతో బరిలోకి సచిన్.. 2ఏళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ..! | Sachin tendulkar fielded for pakistan team before india debut 1987 match

ఇది తెలుసా.. తొలుత పాక్ జెర్సీతో బరిలోకి సచిన్.. 2ఏళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ..! | Sachin tendulkar fielded for pakistan team before india debut 1987 match


Sachin Tendulkar Fielded for Pakistan: క్రికెట్ దేవుడిగా కొలవబడే సచిన్ టెండూల్కర్ టీమిండియా తెల్లటి జెర్సీ ధరించడానికి ముందే పాకిస్థాన్ జట్టు తరుఫున ఫీల్డింగ్ చేశారనే విషయం చాలామందికి తెలియదు. 1987లో ముంబై బ్రాబోర్న్ స్టేడియంలో జరిగిన ఒక ప్రదర్శన మ్యాచ్‌లో సచిన్ పాక్ జెర్సీ వేసుకుని మైదానంలోకి దిగిన ఆనాటి ఆసక్తికర దృశ్యం వివరాలు ఇప్పుడు చూద్దాం.

భారత క్రికెట్ రికార్డుల రారాజు సచిన్ టెండూల్కర్ 1989లో కరాచీ వేదికగా పాకిస్థాన్‌పైనే అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. అయితే అంతకన్నా సరిగ్గా రెండేళ్ల క్రితం 13 ఏళ్ల వయసులో సచిన్ సరిగ్గా అదే పాకిస్థాన్ జట్టు తరుపున సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి అడుగుపెట్టడం విశేషం. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సిసిఐ) స్వర్ణోత్సవాల సందర్భంగా పాకిస్థాన్, సిసిఐ జట్ల మధ్య 40 ఓవర్ల ప్రదర్శన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అనుకోకుండా చోటుచేసుకున్న ఒక చిన్న సంఘటన సచిన్ జీవితంలో మరచిపోలేని అధ్యాయంగా మారింది.

ఇదికూడా చదవండి: Video: ఓరేయ్ ఆజామూ.. మరోసారి నవ్వులపాలైన పాక్ టీమ్.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..!

ఇవి కూడా చదవండి



ఇమ్రాన్ ఖాన్ కోరిక.. మైదానంలోకి సచిన్..

మ్యాచ్ లంచ్ విరామం సమయంలో పాకిస్థాన్ ఆటగాళ్లు జావేద్ మియాందాద్, అబ్దుల్ ఖాదిర్ విశ్రాంతి కోసం హోటల్‌కు వెళ్లారు. దీంతో ఫీల్డింగ్ చేయడానికి ఇద్దరు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లు కావాలని నాటి పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సిసిఐ ప్రతినిధులను కోరారు. డ్రెస్సింగ్ రూమ్ వెలుపల ఉత్సాహంగా నిలబడి ఉన్న 13 ఏళ్ల సచిన్ టెండూల్కర్‌ను చూసి వెంటనే సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి పంపించారు. పచ్చటి పాకిస్థాన్ జెర్సీ ధరించి చిన్నారి సచిన్ అత్యంత ఉత్సాహంతో లాంగ్ ఆన్ ప్రాంతంలో ఫీల్డింగ్ చేయడానికి పరిగెత్తుకెళ్లాడు.

కపిల్ దేవ్ క్యాచ్ మిస్.. ఆనాటి జ్ఞాపకం..

ఆ మ్యాచ్‌లో భారత దిగ్గజం కపిల్ దేవ్ కొట్టిన ఓషాట్‌తో బంతి గాల్లోకి లేచింది. దీనిని క్యాచ్ పట్టేందుకు సచిన్ దాదాపు 15 మీటర్ల దూరం ముందుకు పరిగెత్తాడు. అయితే బంతి సచిన్‌కు కాస్త దూరంలో పడటంతో ఆ క్యాచ్ అందుకోలేకపోయాడు. ‘నేను లాంగ్ ఆన్ కాకుండా మిడ్ ఆన్ స్థానంలో ఉండి ఉంటే కపిల్ దేవ్ క్యాచ్‌ను సులువుగా పట్టుకుని పాకిస్థాన్‌కు వికెట్ అందించేవాడిని’ అని సచిన్ తన ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ పుస్తకంలో చాలా సరదాగా గుర్తుచేసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు అసలు ఈ విషయం గుర్తుందో లేదో అని కూడా ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Video: ఇలాంటి ఔట్ చూశారా.. బద్దకంతో వికెట్ పారేసుకున్న టీమిండియా ప్లేయర్.. ఎవరంటే?

పాక్ జట్టుపైనే మొదలైన మహోజ్వల ప్రస్థానం..

అలా 1987లో పాకిస్థాన్ తరఫున ఫీల్డింగ్ చేసిన ఈ ముంబై కుర్రాడు, సరిగ్గా రెండేళ్ల తర్వాత 1989లో అదే పాకిస్థాన్ పేసర్ల భయంకరమైన బౌలింగ్‌ను ఎదుర్కొంటూ భారత జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించి సచిన్ సాధించిన రికార్డులు చరిత్ర పుటల్లో నిలిచిపోయాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *