Headlines

Palm Jaggery: తాటి బెల్లం అసలైనది ఏది..? నకిలీది ఏది..? గుర్తించడం చాలా ఈజీ | Real vs Fake Palm Jaggery: Easy Ways to Identify Authentic Palm Jaggery

Palm Jaggery: తాటి బెల్లం అసలైనది ఏది..? నకిలీది ఏది..? గుర్తించడం చాలా ఈజీ | Real vs Fake Palm Jaggery: Easy Ways to Identify Authentic Palm Jaggery


తాటి బెల్లం ఆరోగ్యానికి మేలు చేసే సహజ తీపి పదార్థంగా ప్రసిద్ధి చెందింది. తాటి చెట్టు నుంచి సేకరించే సహజ రసాన్ని మరిగించి తయారు చేసే బెల్లాన్ని తాటి బెల్లం అంటారు. ఇది ఎలాంటి రిఫైనింగ్ ప్రక్రియ లేకుండా తయారవడం వల్ల సహజ ఖనిజాలు, పోషకాలు ఉంటాయి. టీ లేదా కాఫీతో పాటు లడ్డూలు, పాయసం, సీట్ల తయారీలోనూ తాటి బెల్లంను చెక్కరకు బదులుగా ఎక్కువగా వాడుతారు. ఆంధ్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో తాటి బెల్లాన్ని విస్తృతంగా తయారు చేస్తారు. అయితే మార్కెట్లో ప్రస్తుతం చక్కెర, చెరకు బెల్లం, రంగు పదార్థాలు కలిపి తయారు చేసిన నకిలీ తాటి బెల్లం కూడా విక్రయిస్తున్నారు. అందుకే అసలైన తాటి బెల్లాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం అవసరం.

అసలైన తాటి బెల్లాన్ని ఎలా గుర్తించాలి?

1. రుచి

అసలైన తాటి బెల్లం తీపితో పాటు స్వల్పంగా పొగ వాసన, కమ్మదనం కలిగిన ప్రత్యేక రుచిని ఇస్తుంది. కేవలం చక్కెర తీపి మాత్రమే అనిపిస్తే అది నకిలీ అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి



2. రంగు

నిజమైన తాటి బెల్లం గాఢ గోధుమ లేదా నలుపు-గోధుమ రంగులో ఉంటుంది. లోపల కూడా సహజమైన మసక రంగే కనిపిస్తుంది. చాలా మెరుస్తూ లేదా ఒకేలా మెరిసే రంగు ఉంటే దాన్ని నకిలీదని అనుమానించాలి.

3. గట్టితనం

అసలైన తాటి బెల్లం గట్టిగా ఉంటుంది. కొన్ని వారాల్లోనే బాగా మెత్తబడితే లేదా అంటుకునేలా మారితే నాణ్యతపై సందేహించాలి.

4. విరిచి చూడండి

ముక్కను విరిచినప్పుడు లోపల సహజమైన గోధుమ-నలుపు రంగు కనిపిస్తుంది. చాలా మెరిసే ఉపరితలం లేదా అసహజంగా సమానమైన రంగు ఉంటే అది కల్తీ కావచ్చు.

5. శబ్ద పరీక్ష

తాటి బెల్లం ముక్కను నేలపై స్వల్పంగా తట్టినప్పుడు మితమైన శబ్దం వస్తుంది. చాలా గట్టిగా, లోహంలాంటి శబ్దం వస్తే అది నకిలీ లేదా ఎక్కువ చక్కెరతో తయారై ఉండే అవకాశం ఉంది.

అసలైన తాటి బెల్లం ఎలా తయారవుతుంది?

తాటి చెట్టు నుంచి సేకరించిన సహజ రసాన్ని మరిగించి ఎలాంటి రసాయనాలు లేదా ప్రిజర్వేటివ్‌లు కలపకుండా తయారు చేస్తారు. అందువల్ల ఇందులో సహజ ఖనిజాలు నిల్వ ఉంటాయి.

కొనుగోలు సమయంలో గుర్తుంచుకోవాల్సినవి

విశ్వసనీయ బ్రాండ్లు లేదా నమ్మకమైన అమ్మకందార్ల నుంచే కొనుగోలు చేయండి. పదార్థాల జాబితాను జాగ్రత్తగా పరిశీలించండి. అందులో “Palm Sap” లేదా “Palm Jaggery” మాత్రమే ఉండాలి. అత్యంత తక్కువ ధరకు విక్రయించే ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అసలైన తాటి బెల్లం తయారీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

తాటి బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు

శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఐరన్ ఉండడం వల్ల రక్తహీనత నివారణకు కొంతవరకు సహాయపడవచ్చు. కాల్షియం, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి రక్షించడంలో పాత్ర పోషిస్తాయి. చలికాలంలో వేడి పానీయాలు, ఆయుర్వేద తయారీలలో విస్తృతంగా ఉపయోగిస్తారు.

(గమనిక: తెల్ల చక్కెరకు తాటి బెల్లంను ప్రత్యామ్నాయంగా ఉపయోగించినా, ఇది కూడా తీపి పదార్థమే. మధుమేహం ఉన్నవారు లేదా రక్తంలో చక్కెర నియంత్రణ అవసరమైన వారు వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడి సలహాతో పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *