
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం బుల్లితెర ఆడియెన్స్ వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ రియాలిటీ షో కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులోనూ ఈసారి ల్యాండ్ మార్క్ (పదో) సీజన్ కావడంతో ఈసారి బిగ్ బాస్ హౌస్ లో పెను మార్పులు ఉండనున్నాయని సమాచారం. గేమ్స్, టాస్కుల పరంగానూ కొత్త రూల్స్ ను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే కంటెస్టెంట్ల ఎంపికలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న పర్సనాలిటీస్ నే కంటెస్టెంట్లుగా తీసుకోనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో అయితే చాలా పేర్లే వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ వైఫ్ జ్యోతి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నందూస్ వరల్డ్ అలియాస్ నందు, రాయల్ ఎంసీ రమణ, శివ్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, రైటర్ కడలి సత్యనారాయణ, వర్ష, పవిత్ర, వర్షిణీ.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు హౌస్ లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే వీరిలో ఎవరు వస్తారు? ఎవరు రారో? తెలియదు కానీ ఇప్పుడు ఒక సెలబ్రిటీ మాత్రం కచ్చితంగా హౌస్ లోకి అడుగు పెట్టనున్నాడని తెలుస్తోంది. అతను మరెవరో కాదు ఇటీవల ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ రియాలిటీ షోలో విజేతగా నిలిచిన పవన్ కల్యాణ్.
గతంలో పవన్ భార్య వాసంతి కృష్ణన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు మాత్రం పవన్ కల్యాణ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి రానున్నాడని తెలుస్తోంది. కళ్యాణ్ మోడలింగ్, డిజిటల్ కంటెంట్ క్రియేషన్, బుల్లితెర ప్రాజెక్ట్‌ల తో పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ రియాలిటీ షోలో పవన్ బిహేవియర్, కూల్ నెస్, మెచ్యూరిటీ ఆడియెన్స్ ను కట్టి పడేసింది. ఇక సోషల్ మీడియాలోనూ కల్యాణ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన పర్సనల్ ఫొటోస్, వీడియోలు, మోడలింగ్ ఫొటోషూట్‌లు, ఫిట్‌నెస్ వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
భార్య వాసంతి కృష్ణన్ తో పవన్ కల్యాణ్..
View this post on Instagram
మేడ్ ఫర్ ఈచ్ అదర్ రియాలిటీ షోలో విజేగా నిలిచిన తర్వాత పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో సందడి చేశాడు పవన్. దీంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోనూ అతను కచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాడని నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. మరి పవన్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తాడో? రాడో? అన్నది తెలియాలంటే బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ దాకా ఆగాల్సిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి