యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో తిరువీర్, తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఓ సుకుమారి’. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ‘హీరోయిన్ ను ముట్టుకుంటే కరెంట్ షాక్’అనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా దానిని వినోదాత్మకంగా తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడు. దీంతో ఈ సినిమా కేవలం యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. అయితే ఈ మధ్యన థియేటర్లలో ఆడని సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై సౌండ్ చేయని సినిమాలు సైతం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై భారీ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఓ సుకుమారి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ఓ సుకుమారి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్టు 07 నుంచి ఐశ్వర్య, తిరువీర్ ల సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి ఈ సినిమాను నిర్మించారు. ఝాన్సీ, మురళీధర్ గౌడ్, ఆనంద్, ఆమని, శ్రీనివాస్ గవిరెడ్డి లాంటి సీనియర్ నటీనటులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. భరత్ మంచీరాజు సంగీతం అందించారు. మరి థియేటర్లలో పెద్దగా ఆడని ఓ సుకుమారి ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
అమెజాన్ ప్రైమ్ లో ఓ సుకుమారి సినిమా..
📢 Official Announcement…#OhSukumari (Telugu) streaming from August 7 on PrimeVideo in Telugu, Tamil, Kannada & Malayalam 🍿!!#OTT_Trackers pic.twitter.com/71UMt9Fivd
— OTT Trackers (@OTT_Trackers) August 4, 2026
ఓ సుకుమారి సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.