బుల్లితెర నటి సమీరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ అడియన్స్ కు దగ్గరైంది. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పిన సమీరా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వివాహ బంధానికి దారితీసిన ప్రేమకథను మొదటిసారిగా పంచుకున్నారు. ఆమె సయ్యద్ అన్వర్‌ను తొలిసారి కలిసిన తీరు ఆశ్చర్యకరంగా, అనూహ్యంగా జరిగింది. సమీరా తన కథను వివరిస్తూ, సయ్యద్ అన్వర్‌తో అంతకు ముందు రెండు, మూడు సార్లు అనుకోకుండా కలిసినప్పటికీ, ఒకరినొకరు గుర్తించే పరిస్థితి రాలేదని, ఆ తర్వాత కాలంలో మాట్లాడుకున్నప్పుడు మాత్రమే ఆ విషయాలు తెలిశాయని పేర్కొన్నారు. అయితే, వారికి స్పష్టంగా గుర్తుండిపోయిన మొదటి పరిచయం 2015 మార్చి 6న జరిగిందని. ఆ రోజు ఆమె తన పని నిమిత్తం ఇన్ ఆర్బిట్ మాల్‌కు వెళ్లానని అన్నారు. మాల్లో తన పనిలో ఉండగా, వెనుక నుండి ఇద్దరు యువకులు వచ్చి “సమీరా” అని పిలిచారని. ఆ సంఘటన తనను కాస్త ఆశ్చర్యపరిచిందని చెప్పుకొచ్చింది. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి తెలుగు రాష్ట్రాలలో, ఒక నటిని లేదా ఎవరినైనా గౌరవంగా గారు అని చేర్చి సమీరా గారు లేదా మేడమ్ అని సంబోధిస్తారని, కేవలం పేరుతో పిలవడం సర్వసాధారణం కాదని ఆమె అన్నారు.
ఎక్కువమంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..
ముఖ్యంగా మగవారు ఒక ఆడపిల్లను పిలిచేటప్పుడు గారు అని చేర్చడం సహజమని, తాను ఎప్పుడూ బహిరంగ ప్రదేశంలో ఒక మగవారి గొంతు నుండి నేరుగా తన పేరును వినలేదని ఆమె వివరించారు. వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను “సమీరా, రైట్?” అని అడిగారని. అందుకు ఆమె “అవును” అని బదులిచ్చానని గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఆ వ్యక్తి “కెన్ ఐ క్లిక్ ఏ పిక్చర్ విత్ యూ?” అని అడిగారని.. ఆమె సమ్మతి తెలపడంతో, ఆ వ్యక్తి తన పక్కన ఉన్న ఇంకో అబ్బాయికి ఫోన్ ఇచ్చి ఫోటో తీయించుకున్నారు. ఫోటో తీసుకునే సమయంలో, ఆ వ్యక్తి తన నటనను ఎంతగానో అభినందిస్తూ, “ఐ రియల్లీ లైక్ యువర్ యాక్టింగ్. ఐ వాచ్ యువర్ ప్రతిబింబం” అని ఇంగ్లీష్‌లో ఒక స్టైల్‌గా మాట్లాడారని సమీరా గుర్తుచేసుకున్నారు. ఆమె వారికి “థాంక్యూ, థాంక్యూ” అని చెప్పి, ఫోటో ఇవ్వగానే, వారు కూడా వంగి “థాంక్యూ” అని కృతజ్ఞతలు తెలిపారు.
వారు వెళ్ళిపోతుండగా, సమీరా తన పని నిమిత్తం మళ్ళీ వెనక్కి తిరుగుతుండగా, ఆ యువకుడు “బై ది వే, మై సనా జీ కా బేటా హు” అని చెప్పారు. ఈ మాట వినగానే సమీరా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తాను అప్పటికే నటి సనాతో కలిసి ప్రతిబింబం సీరియల్లో నటిస్తున్నందున, ఆయన తన సహనటి కుమారుడని తెలిసి ఎంతో ఇబ్బంది పడినట్లు తెలిపారు. అయ్యో, తన సహనటి కుమారుడిని తెలియక ఒక అభిమానితో మాట్లాడినట్లు మాట్లాడానని భావించి, వెంటనే “అయ్యో, ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ డిడ్ట్ నో” అని క్షమాపణలు చెప్పారు. అప్పటివరకు సనా కుమారుడు ఎవరు అనే విషయం తనకు తెలియదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆశ్చర్యకరమైన, ఆకస్మికమైన పరిచయమే సమీరా, సయ్యద్ అన్వర్ల ప్రేమకథకు నాంది పలికిందని ఆమె తెలిపారు. ఈ సంఘటన వారిద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన బంధానికి పునాది వేసింది, అది చివరికి వారి వివాహానికి దారితీసింది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..
సమీరా పోస్ట్..
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..