Headlines

Tollywood : హీరోయిన్లు స్విమ్ సూట్ వేస్తే గ్లామర్.. నేను వేస్తే తప్పా.. ? లేడీ కమెడియన్ కామెంట్స్.. | Actress Vidyullekha Open Up on Social Media Trolling About Her Dressing

Tollywood : హీరోయిన్లు స్విమ్ సూట్ వేస్తే గ్లామర్.. నేను వేస్తే తప్పా.. ? లేడీ కమెడియన్ కామెంట్స్.. | Actress Vidyullekha Open Up on Social Media Trolling About Her Dressing


సౌత్ ఇండస్ట్రీలో తనదైన కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామ్. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రంలో సాంబార్ సాంబార్ దా అనే డైలాగ్ తో మరింత పాపులర్ అయ్యింది. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ ప్రయాణం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి వెల్లడిస్తూ బాధపడింది. హనీమూన్‌లో స్విమ్ సూట్ ధరించడంపై ఎదురైన ట్రోలింగ్, బాడీ షేమింగ్ వివాదంపై నటి విద్యుల్లేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓకేషన్‌కు వెళ్లినప్పుడు స్విమ్ సూట్ కాకుండా చీర కట్టుకోవాలా లేక ప్యాంట్ షర్ట్ వేసుకోవాలా అని ప్రశ్నించారు. ఈ విషయంలో సమాజంలో ఉన్న డబుల్ స్టాండర్డ్స్‌ను ఆమె ఘాటుగా విమర్శించారు. సినిమా హీరోయిన్లు స్విమ్ సూట్ ధరిస్తే గ్లామర్‌గా అంగీకరించే సమాజం, సామాన్యులు వేస్తే విమర్శలకు దిగడం దారుణమన్నారు. “నా బాడీ, నా ఛాయిస్” అనే బలమైన సందేశాన్నిచ్చిన విద్యుల్లేఖ, ట్రోలర్‌ల ప్రధాన ఉద్దేశ్యం కేవలం ఒక ప్రతిస్పందనను రాబట్టడమేనని స్పష్టం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

బాడీ పాజిటివిటీ, స్వేచ్ఛాయుతమైన జీవనశైలిని సమర్థిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అలాగే తన కెరీర్‌లో రాజు గారి గది చిత్రం తనకెంత ప్రత్యేకమో వెల్లడించారు. ఈ సినిమా తనకు ఒక అద్భుతమైన అనుభూతిని పంచిందని, కేవలం 30 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుందని ఆమె తెలిపారు. రాజు గారి గది తన జీవితంలో మొదటిసారి తన ముఖం ఒక సినిమా పోస్టర్‌పై కనిపించిన చిత్రం అని విద్యుల్లేఖ సంతోషం వ్యక్తం చేశారు. ఐదుగురు ప్రధాన పాత్రలలో తాను కూడా ఒకరిగా నిలిచానన్నారు.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

దర్శకుడు ఓంకార్ అన్న తన నటనపై చాలా నమ్మకం ఉంచి, ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌కు మంచి స్కోప్ ఇచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో తాను ఏడ్చానని, నవ్వానని, భయపడ్డానని, ఇలా అన్ని రకాల భావోద్వేగాలను పండించే అవకాశం లభించిందని చెప్పారు. రాజు గారి గదిలో నటించడం నిజంగా ఒక ప్రియమైన అనుభవం అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రాజు గారి గది 2లో కూడా నటించినప్పటికీ, దాని కాన్సెప్ట్ మారిపోవడంతో తన పాత్ర చిన్నదని ఆమె తెలిపారు. అయితే, రాజు గారి గది 1 మాత్రం తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని విద్యుల్లేఖ రమణ స్పష్టం చేశారు. ఈ చిత్రం ఆమె కెరీర్‌లో ఒక మరుపురాని మైలురాయిగా నిలిచింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

విద్యుల్లేఖ రామన్ పోస్ట్..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *