Headlines

చిన్నగా ఉందని చులకనగా చూడొద్దు.. కూరగాయల్లోనే కింగ్.. బోడ కాకర ప్రత్యేకత ఇదే.. | Powerful Health Benefits To Boda Kakara: Teasel Gourd A Seasonal Superfood for Diabetes, Heart Health and Immunity Aa Kakarakaya

చిన్నగా ఉందని చులకనగా చూడొద్దు.. కూరగాయల్లోనే కింగ్.. బోడ కాకర ప్రత్యేకత ఇదే.. | Powerful Health Benefits To Boda Kakara: Teasel Gourd A Seasonal Superfood for Diabetes, Heart Health and Immunity Aa Kakarakaya


బోడ కాకరకాయ.. దీనిని కొన్ని ప్రాంతాలలో బొంత కాకర, ఆగాకర, అడవికాకర అని కూడా పిలుస్తారు. ఇది కేవలం రుచికరమైన కూరగాయ మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నిలయం. సాధారణంగా చికెన్, మటన్‌ల నుండి లభించే పోషకాల కంటే ఎక్కువ పోషకాలను ఈ కూరగాయ అందిస్తుంది. అందుకే బోడ కాకరకాయను కూరగాయలలో కింగ్‌గా పరిగణిస్తారు. శాఖాహారులకు ఇది అద్భుతమైన ఎంపికగా పేర్కొంటారు ఆహార నిపుణులు.. ఈ ప్రత్యేకమైన కూరగాయ వర్షాకాలంలో, ముఖ్యంగా ఆషాఢ శ్రావణ మాసాల్లో మాత్రమే లభిస్తుంది. ఈ సీజన్‌లో దీనిని తీసుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చు. బోడ కాకరకాయలో అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.. ఇది శరీరానికి కావలసిన అన్ని ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది.

బోడ కాకరలో విటమిన్లు, అమైనో ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు, పొటాషియం, ఫాస్పరస్ వంటివి అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి శక్తినిచ్చి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది.

ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి బోడ కాకరకాయ ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో గ్లైసెమిక్ ఎక్కువగా ఉండటం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ రోగులు తమ ఆహారంలో బోడ కాకరను చేర్చుకోవడం ద్వారా వారి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

బోడ కాకరకాయలో విటమిన్ సి, ఆల్కలాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు, ఫాస్పరస్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. ఈ పోషకాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలు దరిచేరకుండా రక్షణ కల్పిస్తాయి. అంతేకాకుండా, ఇది రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బోడ కాకరకాయ కీలక పాత్ర పోషిస్తుంది.

ఎముకల బలానికి కూడా బోడ కాకరకాయ చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు ధృడంగా మారతాయి. ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యల నుండి రక్షణ లభిస్తుంది.

అధిక రక్తపోటుతో బాధపడేవారికి బోడ కాకర ఒక మంచి ఔషధం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే అధిక పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, బరువు తగ్గాలనుకునే వారికి బోడ కాకర చాలా ప్రయోజనకారి. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.. అధిక ఆకలిని నియంత్రిస్తుంది. అంతేకాకుండా, జీర్ణక్రియను మెరుగుపరచి, శరీర బరువును సమర్థవంతంగా నియంత్రించడంలో తోడ్పడుతుంది.

మొత్తంగా, బోడ కాకరకాయ కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు, పోషకాల గని. దీనిని మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొంది, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *