Headlines

Pradeep Rawat : ప్రదీప్ రావత్ జీవితంలోనే భయానక సంఘటన.. అప్పుడు చావు దాక వెళ్లొచ్చిన నటుడు.. | Ghajini Actor Pradeep Rawat reveals incident which shook his life when shooting Maha Sangram movie

Pradeep Rawat : ప్రదీప్ రావత్ జీవితంలోనే భయానక సంఘటన.. అప్పుడు చావు దాక వెళ్లొచ్చిన నటుడు.. | Ghajini Actor Pradeep Rawat reveals incident which shook his life when shooting Maha Sangram movie


భారతీయ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తన గంభీమైన బాడీ లాంగ్వేజ్, రస్టిక్ లుక్, డైలాగ్ డెలివరీతోపాటు తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 74 సంవత్సరాలు. గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న ప్రదీప్.. నెల రోజులుగా ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ప్రదీప్ రావత్ మరణవార్త వినగానే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. హీరో పాత్రలకు ధీటుగా తన నటనతో వెండితెరపై సెన్సేషన్ అయ్యాడు ప్రదీప్ రావత్. సై సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. గజిని, అందరివాడు, చత్రపతి, దేశముదురు, జగడం, నాయక్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. తన సినీ ప్రయాణంలో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించారు.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

ఇదిలా ఉంటే.. ప్రదీప్ రావత్ జీవితాన్ని కుదిపేసిన ఒక ప్రమాదకరమైన ఘటన గురించి చాలా మందికి తెలియదు. వినోద్ ఖన్నా కథానాయకుడిగా నటిస్తున్న మహాసంగ్రామ్ సినిమా షూటింగ్ సమయంలో ఆయన దాదాపు చావు అంచుల దాకా వెళ్లొచ్చారు. సముద్రంలోని ఒక పెద్ద ఓడపై పోరాట సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో వినోద్ ఖన్నా కొడుతుంటే ప్రదీప్ రావత్ తప్పుకోవాల్సి ఉంటుంది. కానీ అంచనా తప్పి ఆయన సముద్రం మమధ్యలో పడిపోయారు. ఈత వచ్చినప్పటికీ అలల తీవ్రత ఎక్కువగా ఉండడం.. సుడిగుండాల నడుమ ఓడ తిరుగుతుండగా.. సముద్రంలో మునిగిపోతూ ఓడ కింద ఉండే పవర్ ఫుల్ ఇంజిన్ ఫ్యాన్ కు తగిలే పరిస్థితి ఏర్పడింది.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

వెంటనే అక్కడే ఓడ కింద భాగంలో ఉన్న ఒక ఇనుప కమ్మీ ఆయన చేతికి తగలడంతో దానిని గట్టిగా పట్టుకుని కేకలు వేయడంతో అక్కడున్న జాలర్లు.. చిత్రయూనిట్ సభ్యులు వెంటనే స్పందించారు. పై నుంచి సేఫ్టీ ఫ్లోటింగ్ ట్యూబులు, తాళ్లు విసిరి జాలర్ల సహాయంతో ఆయనను సురక్షితంగా రక్షించారు. ఆ ఘటన ప్రదీప్ రావత్ జీవితంలో భయానక సంఘటన. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *