Headlines

Viral Video: విశ్వాసానికి నిదర్శనం.. యజమాని కుటుంబాన్ని కాపాడేందుకు విషసర్పంతో పోరాడిన పెంపుడు కుక్క..! గంటకు పైగా..

Viral Video: విశ్వాసానికి నిదర్శనం.. యజమాని కుటుంబాన్ని కాపాడేందుకు విషసర్పంతో పోరాడిన పెంపుడు కుక్క..! గంటకు పైగా..


Viral Video: విశ్వాసానికి నిదర్శనం.. యజమాని కుటుంబాన్ని కాపాడేందుకు విషసర్పంతో పోరాడిన పెంపుడు కుక్క..! గంటకు పైగా..

ఉత్తర ప్రదేశ్‌లో పెంపుడు కుక్క చూపించిన విశ్వాసం, త్యాగం నెటిజన్లను తీవ్రంగా చలింపజేసింది. ఒక ఇంట్లోకి ఆకస్మాత్తుగా తీవ్రమైన విషం కలిగిన ఒక పాము ప్రవేశించింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ప్రమాదాన్ని గమనించేలోపే పాము వారివైపు వెళ్లడానికి ప్రయత్నించింది. విషసర్పం ఇంట్లోకి రావడం గమనించిన పెంపుడు కుక్క వెంటనే అప్రమత్తమైంది. కుటుంబ సభ్యులకు ప్రమాదం రాకుండా ఆ పాముకు అడ్డుగా నిలిచింది. పాము ముందుకు వెళ్లకుండా దాదాపు గంట పాటు దాంతో తీవ్రంగా పోరాడింది.

ఆ పోరాటంలో పెంపుడు కుక్క పామును తీవ్రంగా గాయపరిచి, ఇంట్లోని వారి వద్దకు వెళ్లకుండా నిరోధించగలిగింది. అయితే, ఈ క్రమంలో విషసర్పం సదరు కుక్కను పలుమార్లు కాటు వేసింది. గంటపాటు జరిగిన ఈ పోరాటంలో పాము చనిపోగా, తీవ్రమైన విషం శరీరంలోకి పాకడంతో ఆ పెంపుడు కుక్క కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

వీడియో ఇక్కడ చూడండి..

తమ ప్రాణాలను కాపాడేందుకు తమ కళ్లముందే పెంపుడు కుక్క ప్రాణాలు వదలడం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తాము పెంచుకున్న మూగజీవి చూపించిన ఈ అసమాన సాహసం, విశ్వాసం తమను జీవితాంతం రుణపడి ఉండేలా చేశాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వేలాది మంది నెటిజన్లు ఆ పెంపుడు కుక్క అద్భుతమైన విశ్వాసానికి, త్యాగానికి అంజలి ఘటిస్తున్నారు. జంతువులు మనుషులపై చూపించే నిస్వార్థమైన ప్రేమకు ఈ ఘటన మరొక నిదర్శనంగా నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *