దర్శకుడు కోదండరామిరెడ్డి తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో మెగాస్టార్ చిరంజీవి, సంగీత మాంత్రికుడు ఇళయరాజాతో పనిచేసిన తీరును, అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిరంజీవితో తన తొలి పరిచయం న్యాయం కావాలి సినిమాతో ప్రారంభమైందని, అది సూపర్ డూపర్ హిట్ అయ్యిందని గుర్తు చేసుకున్నారు. ఖైదీ సినిమాకు మొదట సూపర్‌స్టార్ కృష్ణగారిని అనుకున్నప్పటికీ, కథానాయకుడు, దర్శకుడు నెల్లూరు ప్రాంతం వారవ్వడం, గతంలో తామిద్దరి కాంబినేషన్ విజయాలను దృష్టిలో ఉంచుకుని చిరంజీవిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఖైదీ చిత్రానికి సంబంధించి, ఒక ఆంగ్ల చిత్రం నుండి గెటప్‌ను మాత్రమే స్ఫూర్తిగా తీసుకుని, కథను పూర్తిగా తామే రూపొందించినట్లు కోదండరామిరెడ్డి వివరించారు. ఆ సినిమాలో “రగులుతోంది మొగలి పొద” పాటపై ఎలాంటి విమర్శలు రాలేదని, ఇప్పటికీ అందరూ ఆ పాటను ఆస్వాదిస్తారని తెలిపారు. ఒకప్పుడు కడపలో ఒక వ్యక్తి ఆ పాట పాడుతూ రోడ్లపై తిరిగేవారని గుర్తు చేశారు.
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
చిరంజీవి అంకితభావం, నిబద్ధత గురించి మాట్లాడుతూ, అభిలాష షూటింగ్ సమయంలో చిరంజీవి పనితీరును వెల్లడించారు. రాత్రి 12 నుండి 2 గంటల వరకు షూటింగ్ చేసినా, మరుసటి రోజు ఉదయం 5 గంటల షాట్‌కు చిరంజీవి సిద్ధంగా ఉండేవారని తెలిపారు. యురేకా సాకామేకా పాటను ఏకంగా 17 రోజులు చిత్రీకరించినట్లు, అందులో కొన్ని షాట్‌లను ఉదయం చేయాల్సి ఉండటం వల్ల చిరంజీవి అలసిపోయినా సిద్ధంగా ఉండేవారని తెలిపారు. తమ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని ప్రచారం జరిగినా, అందులో నిజం లేదని కోదండరామిరెడ్డి స్పష్టం చేశారు. తాము ఎక్కడ కలిసినా మనసు విప్పి మాట్లాడుకుంటామని, కలిసి సినిమాలు చేయకపోవడం వల్లే అలాంటి వదంతులు వచ్చి ఉంటాయని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..
సంగీత దర్శకుడు ఇళయరాజాతో తన అనుభవాలు అద్భుతమైనవని కోదండరామిరెడ్డి చెప్పారు. మరణ మృదంగం సినిమాలోని ఒక పాట కోసం రాజస్థాన్‌కు వెళ్తూ, హఠాత్తుగా పాట అవసరం కావడంతో, ఇళయరాజాను కేరళలో కలిసినట్లు వివరించారు. ఎడారిలో దాహం వేసిన హీరో హీరోయిన్లు ఒక కొలనులో దూకడం, అది గ్రామస్తులకు తాగునీరు కావడం, గ్రామస్తులు వారిని కొట్టడానికి రావడం అనే సన్నివేశాన్ని చెప్పగానే, ఇళయరాజా క్షణాల్లో “కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి” అనే పల్లవిని చెప్పిన వైనం ఆయన సంగీత ప్రతిభకు నిదర్శనమని అన్నారు. ఇళయరాజాకు తెలుగు రాకపోయినా, తన ట్యూన్‌లను సుందరమూర్తిగారి చేత రాయించి, తనకు వినిపించేవారని తెలిపారు. ఇళయరాజా నిజంగా సరస్వతీ స్వరూపుడని కోదండరామిరెడ్డి చెప్పుకోచ్చారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..