Headlines

Weather Report: వాతావరణ శాఖ నుంచి మరో హెచ్చరిక.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు! | Andhra Pradesh, Telangana Weather Rain forecast: IMD Issues Orange and Yellow Alerts for Several Districts

Weather Report: వాతావరణ శాఖ నుంచి మరో హెచ్చరిక.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు! | Andhra Pradesh, Telangana Weather Rain forecast: IMD Issues Orange and Yellow Alerts for Several Districts


గత రెండు వారాలుగా తెలుగురాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉండగా మరోసారి వాతావరణ శాఖ రెండు తెలుగురాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో గురువారం వర్షాలు కురునున్నట్టు తెలిపింది.ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు ఆయా రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను కూడా జారీ చేశాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, నిజామాబాద్ తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సంగారెడ్డి జిల్లాలో ఉరుములు-మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశంఉందని.. వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, జిల్లాల్లో సాయంత్రం 7 గంటల వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌ జారీ

అలాగే వర్షాల సమయంలో గంటకు 40 కి.మీ లోపు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.

ఏపీలో వాతావరణం ఇలా

అటు ఏపీలో సైతం రానున్న మూడు గంటలు పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా విజయనగరం, ఎస్ కోట, భీమునిపట్నం, కొత్తవలస, భోగాపురం, ఆనందపురం, సబ్బవరం, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలింది.

అలాగే మన్యం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *