పినాకా ప్రత్యేకతలు ఏమంటే. ఖచ్చితమైన దాడి (Precision Strike): కేవలం గుడ్డిగా రాకెట్లను కురిపించకుండా, శత్రువుల కమాండ్ సెంటర్లు, రాడార్లు, లాజిస్టిక్స్ హబ్స్‌ను కచ్చితంగా ధ్వంసం చేసేలా దీనిని తీర్చిదిద్దారు. ఇందులో INS, GPS తో పాటు భారత్ స్వదేశీ NavIC శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌ను జోడించారు. రేంజ్ పెరుగుతుంది. ఎన్హాన్స్డ్ రేంజ్ పినాకా: 45-60 కి.మీ, గైడెడ్ పినాకా: 75-80 కి.మీ, లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ (LRGR): ఏకంగా 120 కి.మీ దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు.