Headlines

గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు | Air India Flight Hits Severe Turbulence, 12 Injured Before Safe Landing in Delhi video tv9d – Viral Videos in Telugu

గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు | Air India Flight Hits Severe Turbulence, 12 Injured Before Safe Landing in Delhi video tv9d – Viral Videos in Telugu


ఎయిరిండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగా ఈ విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించి.. విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌లైన్స్‌ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎయిరిండియా విమానం పుకెట్ నుంచి దిల్లీకి బయల్దేరింది. కొద్ది సేపట్లో గమ్య స్థానానికి చేరుతుందనగా.. భారీ గాలులకు అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల కిందకు పడిపోయింది. దీంతో కుదుపులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది సహా మొత్తం 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మంగళవారం 134 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం, వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పుల కారణంగా తీవ్ర కుదుపులకు లోనైంది. ఈ సమయంలో విమానం హఠాత్తుగా కిందకు పడిపోయినంత పనైంది. కొందరు ప్రయాణికులు తమ సీట్లలోంచి ఎగిరి విమానం పైకప్పును ఢీకొట్టారు. సడన్ షాక్‌తో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఘటనలో విమానానికి కూడా స్వల్ప నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ క్రమంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. గాయపడిన ప్రయాణికులు, విమాన సిబ్బందిని వెంటనే ఎయిర్‌పోర్టులోని మెడికల్ సెంటర్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందరూ స్వల్ప గాయాలతోనే బయటపడ్డారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని ఎయిర్‌ఇండియా సంస్థ ప్రకటనలో ధ్రువీకరించింది. భద్రతే తమ ప్రాధాన్యమని, ఘటనపై దర్యాప్తునకు సహకరిస్తామని స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కలెక్టర్‌ అవుతానని చెప్పి.. ఇలా చేశావేంటి తల్లీ.. ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు..!

సారూ.. మా ఊరికి బస్సెయ్యరూ..! ఆరేళ్ల చిన్నారి విజ్ఞప్తి

విస్తరిస్తున్న ఉపరితల ఆవర్తనం వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు ఆ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్

కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు

పిల్లల ప్రాణాలు తీస్తున్న అరుదైన వైరస్.. హైఅలర్ట్ ప్రకటించిన సర్కార్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *