Headlines

Central Government: ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్.. ప్రతీఒక్కరూ చేరవచ్చు.. | Post Office Monthly Income Scheme: Earn 7.4 percent Interest with Guaranteed Monthly Income

Central Government: ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్.. ప్రతీఒక్కరూ చేరవచ్చు.. | Post Office Monthly Income Scheme: Earn 7.4 percent Interest with Guaranteed Monthly Income


పోస్ట్ ఆఫీస్ అనేక చిన్న పొదుపు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ స్కీమ్స్ పెట్టుబడులకు చాలా సురక్షితమైనవిగా చెప్పవచ్చు. వీటిల్లో మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్లకు కేంద్రం గ్యారంటీ ఇస్తోంది. పోస్టాఫీసుల్లో అనేక మంచి పథకాలు ఉండగా.. అందులో ఒకటి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్( POMIS ). పిల్లల కోసం డబ్బులు పొదుపు చేయాలకుకునే తల్లిదండ్రులకు కూడా ఇది మంచి పథకంగా చెప్పవచ్చు. అసలు ఈ పథకంలో ఎలా చేరాలి..? వడ్డీ రేటు ఎంత ఉంటుంది..? ఈ పథకం వల్ల ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఈ పథకంలో వడ్డీ ఎంతంటే..?

ప్రస్తుతం ఈ పథకం 7.4% వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది.మీరు ఒకసారి పెట్టుబడి పెడితే ప్రతీ నెలా వడ్డీ జమ అవుతూ ఉంటుంది. కేవలం రూ.వెయ్యి పెట్టుబడితో మీరు దీనిని ప్రారంభించవచ్చు. ఐదు సంవత్సరాల తర్వాత మీరు ప్రతీ నెలా ఆదాయం పొందవచ్చు. ఈ పథకం కింద ఒక ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. అదే జాయింట్ అకౌంట్లో అయితే రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను తెరిచే వెసులుబాటు ఇందులో ఉంది. కానీ మొత్తం పెట్టుబడి రూ.9 లక్షలకు మించకూడదు. ఉదాహరణకు ఈ స్కీములో ఒక పెట్టుబడిదారుడు రూ.5 లక్షలు జమ చేస్తే.. 7.4% వార్షిక వడ్డీ రేటు ప్రకారం ఏడాదికి రూ.37 వేల వడ్డీ అందుతుంది. అంటే నెలకు రూ.3,083 వడ్డీ వస్తుంది.

మైనర్ల పేరు మీద అకౌంట్ తెరవొచ్చా..?

అయితే వయోజన వ్యక్తి ఒక అకౌంట్‌ను మాత్రమే తెరవొచ్చు. ఇక గరిష్టంగా ముగ్గురు పెద్దల కోసం ఉమ్మడి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మైనర్ పిల్లల పేరు మీద తల్లిదండ్రులు ఖాతాను తెరిచే అవకాశం ఉంది. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ ఈ ఖాతాను తన పేరు మీద నిర్వహించుకోవచ్చు. ఈ పథకానికి 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. మీరు అత్యవసరంగా డబ్బులు అవసరమైతే ముందుగానే ఖాతాను మూసివేయచ్చు. అయతే ఖాతా తెరిచిన ఒక సంవత్సరం లోపు డబ్బు విత్‌డ్రా చేయలేరు. ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలలోపు ఖాతాను మూసివేసినప్పుడు డిపాజిట్ మొత్తంలో 2 శాతం కట్ చేస్తారు. ఇక మూడు సంవత్సరాల తర్వాత లేదా ఐదు సంవత్సరాలలోపు అకౌంట్ మూసివేస్తే 1 శాతం కొత ఉంటుంది. ఈ పథకం కింద సంపాదించిన వడ్డీని నెలవారీగా పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాకు లేదా ECS ద్వారా బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. ఏ నెలలోనైనా వడ్డీని విత్‌డ్రా చేయకపోతే అదనపు వడ్డీ జమ అవ్వదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *