Headlines

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్‌ ధర ఎంతో తెలుసా? | Gold Prices Surge Again: 24K Gold Jumps rs 1,750, Silver Up rs 5,000 on August 5 video – Business Videos in Telugu

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్‌ ధర ఎంతో తెలుసా? | Gold Prices Surge Again: 24K Gold Jumps rs 1,750, Silver Up rs 5,000 on August 5 video – Business Videos in Telugu


సామాన్యులకు మరోసారి షాక్ ఇస్తూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడం, అమెరికా డాలర్ కదలికలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి వంటి అంశాల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు పెరిగాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు తాజా ధరలను తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. గత కొంత కాలంగా బంగారం ధరల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడల్లా పసిడి ధరలు అమాంతం ఎగసిపడుతున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 5 బుధవారం ధరలను చూస్తే దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1750 పెరిగి, రూ. 1,45,750ల వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1600 పెరిగి, రూ.1,33,600 కు చేరింది. వెండి ధర కూడా రూ.5,000 పెరిగి కేజీ రూ.2,40,000 పలుకుతోంది. ఆగస్టు 5 బుధవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.1,45,900 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం రూ.1,33,750 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,45,750 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,600 పలుకుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 1,43,990, అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,31,990 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,750 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,600 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.2,34,000 పలుకుతోంది. ఈ ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. కనుక వినియోగదారులు బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌ చేసుకొని వెళ్లడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు

కలెక్టర్‌ అవుతానని చెప్పి.. ఇలా చేశావేంటి తల్లీ.. ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు..!

సారూ.. మా ఊరికి బస్సెయ్యరూ..! ఆరేళ్ల చిన్నారి విజ్ఞప్తి

విస్తరిస్తున్న ఉపరితల ఆవర్తనం వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు ఆ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్

కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *