Headlines

PV Sindhu : కోహ్లీ ఒకే ఒక్క మాట.. సింధు కెరీర్‌ను మలుపు తిప్పిన ఆ రహస్య మంత్రం ఏంటో తెలుసా? | How Virat Kohlis Advice Inspired PV Sindhu to Win the Japan Open 2026 Title

PV Sindhu : కోహ్లీ ఒకే ఒక్క మాట.. సింధు కెరీర్‌ను మలుపు తిప్పిన ఆ రహస్య మంత్రం ఏంటో తెలుసా? | How Virat Kohlis Advice Inspired PV Sindhu to Win the Japan Open 2026 Title


PV Sindhu : క్రీడా రంగంలో ఓటములు, గాయాలు ఎదురైనప్పుడు తిరిగి పాత స్థాయికి చేరుకోవడం ఏ అథ్లెట్‌కైనా సవాలే. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. రెండేళ్ల పాటు సరైన ఫామ్ లేక, గాయాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమె సాధించిన జపాన్ ఓపెన్ 2026 విజయం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ ప్రతిష్టాత్మక టోర్నీని గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించారు. అయితే ఈ అద్భుత పునరాగమనం వెనుక కఠిన శిక్షణతో పాటు క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఇచ్చిన ఒక అమూల్యమైన సలహా, ఆమె భర్త అందించిన సహకారం ముడిపడి ఉన్నాయి.

కింగ్ కోహ్లీ ఇచ్చిన మాస్టర్ అడ్వైస్

ఫామ్ లేక సతమతమవుతున్న రోజుల్లో సింధు, విరాట్ కోహ్లీని కలిసి తన ఆవేదనను పంచుకున్నారు. తాను వైఫల్యాల నుంచి బయటపడటానికి సెంచరీల కరువు సమయంలో కోహ్లీ అనుసరించిన వ్యూహమేంటో అడిగి తెలుసుకున్నారు. దానికి విరాట్ చాలా ప్రశాంతంగా స్పందిస్తూ… “ఫలితాల గురించి ఆలోచించడం మాని, ఆటలోని అసలైన ఆనందాన్ని వెతుక్కో. పరుగులు తీయడంలో ఉన్న తృప్తిని ఆస్వాదించడం మొదలుపెట్టు” అని చెప్పారు. ఈ చిన్న మాట సింధు ఆలోచనా దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. ఒత్తిడికి స్వస్తి చెప్పి, మైదానంలో ఆటను మళ్లీ ప్రేమించడం ఎలాగో ఈ మాట ద్వారానే ఆమె గ్రహించారు.

అట్లాంటాలో మైండ్ సెట్ రీసెట్

కాలు వేలి లిగమెంట్ దెబ్బతినడంతో వైద్యుల సలహా మేరకు సింధు మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ కష్టకాలంలో ఆమె భర్త వెంకట దత్త సాయి ఆమెకు కొండంత అండగా నిలిచారు. బర్నౌట్ నుంచి బయటపడేందుకు ఆమెను అమెరికాలోని అట్లాంటాలో ఉన్న ఎక్సోస్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ వెయిన్, టిమ్, రయాన్ అనే ముగ్గురు నిపుణుల పర్యవేక్షణలో ఫిట్‌నెస్ సాధించారు. స్టార్ ఇమేజ్‌ను పక్కన పెట్టి, ఒక సాధారణ క్రీడాకారిణిగా ప్రశాంతమైన కుటుంబ వాతావరణంలో ఆటపై ఉన్న ఆసక్తిని పునరుద్ధరించుకున్నారు.

స్పోర్ట్స్ సైన్స్ విశ్లేషణ, డైట్ ప్లాన్

పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆమె కోచింగ్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ బృందం సింధు పాత మ్యాచుల డేటాను లోతుగా విశ్లేషించింది. ఈ డేటా విశ్లేషణలో రెండు కీలక విషయాలు బయటపడ్డాయి. ఒకటి, ఆమెలో అటాకింగ్ మైండ్‌సెట్ తగ్గడం వల్ల ఒక పాయింట్ సాధించడానికి ఎక్కువ రాలీలు ఆడాల్సి వచ్చి, తప్పులు పెరిగాయి. రెండోది, మ్యాచుల్లో లైన్ జడ్జిమెంట్ అంచనాలు తప్పుతుండటం. ఈ లోపాలను సరిదిద్దడానికి 13 మంది సభ్యుల నిపుణుల బృందం అహర్నిశలు శ్రమించింది. అలాగే టోర్నీకి ముందే ఆమె ప్రత్యేక ఆహార నియమాలు పాటించి 3.5 కిలోల బరువు తగ్గారు. ప్రోటీన్ కోసం చికెన్‌ను ఆహారంలో భాగంగా చేర్చుకోగా, టైటిల్ నెగ్గాక గ్రాండ్ గా ఐస్‌క్రీమ్‌తో సెలబ్రేట్ చేసుకున్నారు.

కన్నీళ్లలో మునిగిన విజయోత్సవం

ఈ పక్కా ప్రణాళిక, క్రమశిక్షణతో జపాన్ ఓపెన్ ఫైనల్లో అకానె యమగూచిని ఓడించి సింధు విజేతగా నిలిచారు. రెండేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కడంతో, ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే ఆనందంతో ఆమె బృంద సభ్యులందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసంతో పోరాడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన స్ఫూర్తిదాయక ప్రయాణం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *