Headlines

GATE స్కోర్‌తో నేరుగా ISROలో ఉద్యోగం చేసే ఛాన్స్.. ఎలాంటి రాత పరీక్ష లేదు! డైరెక్ట్ లింక్ ఇదిగో | ISRO Recruitment 2026: GATE Score Holders Can Apply for 92 ISRO Scientist Posts

GATE స్కోర్‌తో నేరుగా ISROలో ఉద్యోగం చేసే ఛాన్స్.. ఎలాంటి రాత పరీక్ష లేదు! డైరెక్ట్ లింక్ ఇదిగో | ISRO Recruitment 2026: GATE Score Holders Can Apply for 92 ISRO Scientist Posts


ప్రతిష్ఠాత్మక భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో ఉద్యోగం సాధించాలని కలలు కనే ఇంజినీరింగ్ అభ్యర్థులకు అద్భుత అవకాశం వచ్చింది. భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖకు చెందిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ICRB) ద్వారా సైంటిస్ట్/ఇంజినీర్ ‘ఎస్సీ’ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్, ఆర్కిటెక్చర్ విభాగాల్లో మొత్తం 92 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే GATE స్కోర్ ఆధారంగా ఈ పోస్టులకు పెంపిక చేస్తారు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..

  • ఎలక్ట్రానిక్స్ విభాగంలో పోస్టుల సంఖ్య: 34
  • మెకానికల్ విభాగంలో పోస్టుల సంఖ్య: 26
  • కంప్యూటర్ సైన్స్ విభాగంలో పోస్టుల సంఖ్య: 13
  • సివిల్ విభాగంలో పోస్టుల సంఖ్య: 10
  • ఎలక్ట్రికల్ విభాగంలో పోస్టుల సంఖ్య: 4
  • రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్ విభాగంలో పోస్టుల సంఖ్య: 2
  • ఆర్కిటెక్చర్ విభాగంలో పోస్టుల సంఖ్య: 2
  • సివిల్ (PRL) విభాగంలో పోస్టుల సంఖ్య: 1

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ లేదా సమాన అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్ట్ 17, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.250 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఎలాంటా రాత పరీక్ష ఉండదు. కేవలం గేట్ స్కోర్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున ప్రారంభ వేతనంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు అందిస్తారు.

ఇవి కూడా చదవండి



ఇస్రోలో సైంటిస్ట్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *