Headlines

Kisan Credit Card: రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితి మరింత పెంపు.. ఇకపై ఎంత తీసుకోవచ్చంటే..? | Central government Hikes Kisan Credit Card Loan Limit to 5 Lakh, Farmers Can Avail Loans Without Collateral

Kisan Credit Card: రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితి మరింత పెంపు.. ఇకపై ఎంత తీసుకోవచ్చంటే..? | Central government Hikes Kisan Credit Card Loan Limit to 5 Lakh, Farmers Can Avail Loans Without Collateral


రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) ద్వారా అందిస్తున్న లోన్ పరిమితిని మరింత పెంచింది. ఇప్పటివరకు రూ.3 లక్షలుగా రుణ పరిమితి ఉండగా.. ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. కూలీల ఖర్చులతో పాటు యంత్రాలు, ఎరువుల ఖర్చులు గత కొన్నేళ్లల్లో భారీగా పెరిగాయి. దీంతో రుణ పరిమితిని కూడా కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రైతులు ఎలాంటి పూచీకత్తు, గ్యారంటీ పెట్టకుండా బ్యాంకుల నుంచి రూ.5 లక్షల లోన్ తీసుకోవచ్చు. లోన్ ఏడాదిలోగా చెల్లిస్తే కేంద్రం వడ్డీపై రాయితీ సౌకర్యం కల్పిస్తోంది.

రూ.5 లక్షలకు పెంపు

కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా కేంద్రం అందించే రుణానికి వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి రుణ పరిమితి మంజూరు అయిన తర్వాత రైతులు తమకు అవసరమైనప్పుడు డబ్బులు ఎప్పుడైనా తీసుకోవచ్చు. రైతులు పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వడ్డీ వ్యాపారులు అధిక మొత్తంలో ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. దీంతో కేంద్రం బ్యాంకుల ద్వారా ఎలాంటి పూచీకత్తు పెట్టాల్సిన అవసరం లేకుండా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఈ లోన్ తీసుకోవాలంటే పట్టాదారు పాసు పుస్తకాలు చూపించాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన జిరాక్స్‌లు అందించాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో అందుబాటులో ఉండే కేసీసీ దరఖాస్తులు నింపి సమర్పించాల్సి ఉంటుంది. ఈ డబ్బులను పంట పెట్టుబడి కోసం ఉపయోగించుకోవచ్చు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు, పంట కోత ఖర్చులు వంటి వాటికి వినియోగించుకోవచ్చు.

4 శాతం వడ్డీకే రుణం

అయితే కేవలం పంట పోలాలకే కాకుండా పాడి పరిశ్రమ, పశుపోషణ, చేపలు, రొయ్యల పెంపకం, మేకలు, పందుల పెంపకం వంటి వారికి కూడా ఈ లోన్ కేంద్రం అందిస్తోంది. కేసీసీ రుణాలకు ఏడాదికి 7 శాతం వడ్డీ ఉంటుంది. రైతులు సకాలంలో చెల్లిస్తే కేంద్రం 3 శాతం వడ్డీ రాయితీ అందిస్తోంది. దీంతో కేవలం 4 శాతం వడ్డీకే ఈ రుణాలు పొందవచ్చు. ఇక ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటకు నష్టం జరిగితే ఆర్బీఐ నిబంధల ప్రకారం రుణ గడువును 5 ఏళ్లకు పెంచే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఇక సమీపంలోని ఏదైనా బ్యాంకుకు వెళ్లి ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ‘జన్ సమర్థ్ పోర్టల్’, ‘కిసాన్ రిన్ పోర్టల్’ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *