Headlines

Pradeep Rawat: అప్పుడే అర్థమైంది.. నాన్న ఇక లేరని.. కన్నీళ్లు పెట్టిస్తోన్న ప్రదీప్ రావత్ కుమారుడి మాటలు | Pradeep Rawat Son Vikramaditya Gets While Remembering Actor Final Moments In ICU

Pradeep Rawat: అప్పుడే అర్థమైంది.. నాన్న ఇక లేరని.. కన్నీళ్లు పెట్టిస్తోన్న ప్రదీప్ రావత్ కుమారుడి మాటలు | Pradeep Rawat Son Vikramaditya Gets While Remembering Actor Final Moments In ICU


సై, ఛత్రపతి వంటి ఎన్నో సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన ప్రదీప్ రావత్ (74) అకాల మరణం అందరినీ కలిచివేసింది. క్యాన్సర్ తో బాధపడుతోన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (ఆగస్టు 06) కన్నుమూశారు. బుధవారం (ఆగస్టు 07) ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులతో పాటు ప్రదీప్ రావత్ స్నేహితులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు నటుడి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ప్రదీప్ రావత్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా అంత్యక్రియల అనంతరం ప్రదీప్ రావత్ కుమారుడు విక్రమాదిత్య మీడియాతో మాట్లాడాడు. తన తండ్రి చివరి రోజుల గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు. ‘నాన్నకు మొదట కడుపులో సాధారణ ఇన్ఫెక్షన్‌ వచ్చిందేమో అనుకున్నాం. అయినా ఎందుకైనా మంచిదని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాం. చాలా మందులు ఇచ్చినా పనిచేయలేదు. నాన్న ఆరోగ్యం బాగా క్షీణించిందని అమ్మ ఒకరోజు ఫోన్‌ చేసింది. మళ్లీ మెడికల్ టెస్టులు చేయించగా.. తెల్ల రక్త కణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని తేలింది.’

‘ఆ వెంటనే నాన్నను కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించాం. అప్పుడే బ్లడ్‌ క్యాన్సర్‌ అని డాక్టర్లు నిర్ధారించారు. అది వినగానే మేం కుప్పకూలిపోయాం. ఇది ఒక అరుదైన రకం క్యాన్సర్. వేగంగా శరీరమంతా విస్తరిస్తుంది. రెండు నెలల క్రితమే నాన్నకు అన్ని పరీక్షలూ చేయించాం. రిపోర్ట్‌లన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ నెలన్నర వ్యవధిలోనే అంతా అయిపోయింది. నాన్న మమ్మల్ని వదిలివెళ్లిపోయారు’ అని విక్రమాదిత్య ఎమోషనల్ అయ్యాడు. ఇక ఐసీయూలో ప్రదీప్‌ రావత్‌ చివరి క్షణాలను గుర్తుచేసుకున్న విక్రమాదిత్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ ఉన్నట్లుండి వైద్యులు మమ్మల్ని పిలవడంతో ఐసీయూ వైపు పరిగెత్తాం. అప్పుడు వైద్యులు నాన్నకి సీపీఆర్ చేస్తున్నారు. అది చూడగానే మాకు అర్థమై పోయింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలిసింది. అవే నాన్న ఆఖరి క్షణాలని, ఆశలు లేవని నాకు అర్థమైంది. ఆ క్షణంలో అమ్మ గుండె పగిలేలా ఏడ్చింది. చూస్తుండగానే అంతా అయిపోయింది’ అని వాపోయాడు విక్రమాదిత్య.

ఇవి కూడా చదవండి



ప్రదీప్ రావత్ అంత్యక్రియల్లో సినీ ప్రముఖులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *