Headlines

Hardik Pandya: ముంబై ఇండియన్స్‌కు బై బై?.. ఎవరూ ఊహించని టీంలోకి హార్దిక్ ఎంట్రీ | Hardik Pandya Goodbye Mumbai Indians? Star All Rounder Could Join KKR as Captain

Hardik Pandya: ముంబై ఇండియన్స్‌కు బై బై?.. ఎవరూ ఊహించని టీంలోకి హార్దిక్ ఎంట్రీ | Hardik Pandya Goodbye Mumbai Indians? Star All Rounder Could Join KKR as Captain


Hardik Pandya: ఐపీఎల్ 2024 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యాకు సంబంధించి ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా వచ్చిన హార్దిక్‌కు ముంబై జట్టులో సరైన ఫలితాలు దక్కలేదు. ఆయన కెప్టెన్సీలో ముంబై వరుసగా నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ద్వారా వేరే జట్టులోకి మారనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. మొదట్లో ఆయన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వైపు వెళ్తారని ప్రచారం జరిగినప్పటికీ, ప్రస్తుతం ఆయన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో చేరనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

KKR కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం

గతంలో 2022, 2023 సీజన్లలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు సారథ్యం వహించి ఒకసారి ట్రోఫీని, మరోసారి రన్నరప్‎గా నిలిపిన హార్దిక్ పాండ్యా, ట్రేడింగ్ ద్వారానే తన పాత ఫ్రాంచైజీ అయిన ముంబైతో మళ్లీ కలిశారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న తాజా కథనాల ప్రకారం.. వచ్చే సీజన్ అంటే ఐపీఎల్ 2027లో ఆయన KKR జట్టుతో జతకట్టబోతున్నారు. కేవలం ఆటగాడిగా మాత్రమే కాకుండా, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు కూడా హార్దిక్ పాండ్యానే చేపట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

అజింక్యా రహానే రిటైర్మెంట్‌తో మారిన ఈక్వేషన్స్

గత రెండు సీజన్లలో (2025, 2026) కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవహరించారు. అయితే ఇటీవలే రహానే అన్ని రకాల అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో KKR ఫ్రాంచైజీకి సీనియర్ అయిన ఒక కొత్త కెప్టెన్ అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనుభవం ఉన్న హార్దిక్ పాండ్యా పేరును KKR యాజమాన్యం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే హార్దిక్ ట్రేడింగ్ విషయమై ముంబై ఇండియన్స్ గానీ, కేకేఆర్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

హార్దిక్ పాండ్యా ఐపీఎల్ కెరీర్ గణాంకాలు

ఐపీఎల్ టోర్నీలో హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 162 మ్యాచ్‌లు ఆడారు. వీటిలో 150 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన ఆయన 27.87 సగటు,  146.28 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 2955 పరుగులు చేశారు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉండగా, ఆయన అత్యధిక స్కోరు 91 పరుగులు. బౌలింగ్ విభాగంలో 116 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసి 33.54 సగటుతో 82 వికెట్లు తీశారు. బౌలింగ్‌లో ఆయన అత్యుత్తమ ప్రదర్శన 5/36 కాగా, ఎకానమీ రేటు 9.35గా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *