Headlines

ఈ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్తే మీ పని ఖతమే.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాంకే..! | Solo travel banned top 5 dangerous places bhutan north korea tibet

ఈ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్తే మీ పని ఖతమే.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాంకే..! | Solo travel banned top 5 dangerous places bhutan north korea tibet


Top 5 Dangerous Places: సొంతంగా ప్రపంచాన్ని చుట్టిరావాలని కలలు కనే సోలో ట్రావెలర్లకు తీవ్ర నిరాశ కలిగించే నిజం ఇది. భద్రతా కారణాలు, కఠినమైన సాంస్కృతిక నిబంధనలు, ప్రమాదకరమైన ప్రకృతి వాతావరణం దృష్ట్యా ప్రపంచంలోని ఐదు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒంటరిగా పర్యటించడంపై అక్కడి ప్రభుత్వాలు తీవ్ర ఆంక్షలు విధించాయి.

స్వేచ్ఛగా తిరగాలనుకునే ఒంటరి పర్యాటకులకు ఉత్తర కొరియా తలుపులు పూర్తిగా మూసివేసింది. ఈ దేశంలో ఒంటరి పర్యటనలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. విదేశీ పర్యాటకులు ఎవరైనా సరే అక్కడి ప్రభుత్వం గుర్తించిన అధికారిక పర్యాటక సంస్థల ద్వారా మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పర్యటన ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రభుత్వ గైడ్లు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటారు. కేటాయించిన పరిమిత ప్రాంతాలు దాటి పర్యాటకులు తమంతట తాముగా ఎక్కడికీ వెళ్లేందుకు వీల్లేదు.

పూటాన్ కఠిన నిబంధనలు.. తిబెత్‌లో స్పెషల్ పర్మిట్ తిప్పలు

పర్యాటక నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ పూటాన్ దేశం సోలో ట్రావెలర్లకు పెద్ద సవాలుగానే మారింది. విదేశీ పర్యాటకులు ఖచ్చితంగా గుర్తింపు పొందిన టూర్ ఆపరేటర్ల ద్వారానే బుకింగ్స్ చేసుకోవాలి. దీనికి తోడు ప్రతిరోజూ భారీ మొత్తంలో సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఫీజు చెల్లించడం తప్పనిసరి. మరోవైపు చైనా పరిధిలోని తిబెత్‌లో సోలో ట్రావెల్ పూర్తిగా అసాధ్యం. ప్రత్యేక అనుమతి పత్రాలు ఉంటేనే తప్ప అక్కడికి అడుగు పెట్టలేరు. కేవలం అనుమతి పొందిన గైడ్, ప్రైవేట్ వాహనం ఉన్న గ్రూప్ పర్యటనలకే అక్కడి యాజమాన్యం పచ్చజెండా ఊపుతుంది.

ఇవి కూడా చదవండి



మక్కా, మదీనా పవిత్ర నగరాల్లో ఆంక్షల పర్వం..

సౌదీ అరేబియాలోని పుణ్యక్షేత్రాలైన మక్కా, మదీనా నగరాల్లో పర్యటనపై కఠినమైన మతపరమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. మక్కా పరిధిలోకి ముస్లిమేతరులు అడుగుపెట్టడంపై తీవ్ర నిషేధం ఉంది. మదీనాలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. హజ్, ఉమ్రా కోసం వచ్చే ముస్లిం భక్తులు కూడా ప్రభుత్వం నిర్దేశించిన మార్గాలు, అధికారిక గైడ్ల పర్యవేక్షణలోనే పర్యటించాల్సి ఉంటుంది.

ఆర్కిటిక్ మంచు ప్రాంతంలో మంచు ఎలుగుబంట్ల ముప్పు..

నార్వే పరిధిలోకి వచ్చే ఆర్కిటిక్ ప్రాంతంలోని స్వాల్బార్డ్ రక్షిత ప్రాంతాలు సోలో పర్యాటకులకు అత్యంత ప్రమాదకరమైనవి. ఇక్కడ మనుషులు నివసించే సరిహద్దులు దాటి ముందుకు వెళ్లాలంటే అనుభవజ్ఞులైన గైడ్ల సాయం తప్పనిసరి. తీవ్రమైన మంచు తుఫానులు, మంచు ఎలుగుబంట్ల తీవ్రమైన దాడి ముప్పు ఉన్నందున ఒంటరిగా వెళ్లే పర్యాటకులకు అనుమతి నిరాకరిస్తారు. సరైన భద్రతా పరికరాలు, నిపుణులైన మార్గదర్శకులు ఉంటేనే ఈ మంచు కొండల్లో సాహస యాత్రలు చేయగలరు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *