Headlines

దేశమంతా ఉదయం.. ఇక్కడ మాత్రం అర్ధరాత్రే స్వాతంత్ర్య వేడుకలు! కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు! | Bihar: Purnea continues Independence Day tradition of hoisting tricolour at midnight

దేశమంతా ఉదయం.. ఇక్కడ మాత్రం అర్ధరాత్రే స్వాతంత్ర్య వేడుకలు! కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు! | Bihar: Purnea continues Independence Day tradition of hoisting tricolour at midnight


భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని అత్యంత వైభవమైన వేడుక ఢిల్లీలోని ఎర్రకోటలో జరుగుతుంది, ఇక్కడ ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అయితే, దేశంలో ఒక నగరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆగస్టు 15 ఉదయం కాకుండా, ఆగస్టు 14 అర్ధరాత్రి ప్రారంభమవుతాయని మీకు తెలుసా? బీహార్‌లోని పూర్నియా జిల్లాలో నిర్వహించే ఈ విశిష్టమైన సంప్రదాయం, మన దేశం నిజంగా స్వాతంత్ర్యం పొందిన ఆ చారిత్రాత్మక క్షణాన్ని మనకు గుర్తు చేస్తుంది.

అర్ధరాత్రి స్వాతంత్ర్యం: ఒక చారిత్రక ఘట్టం.

ఈ విశిష్టమైన సంప్రదాయం 1947లో భారతదేశ స్వాతంత్ర్యంతో ముడిపడి ఉంది. చరిత్ర చెప్పిన దాని ప్రకారం, ఆగష్టు 14 – 15 తేదీలలో అర్ధరాత్రి భారతదేశ స్వాతంత్ర్యం ప్రకటించారు. సరిగ్గా రాత్రి 12:01 గంటలకు, రేడియో భారతదేశ స్వాతంత్ర్యాన్ని ప్రకటన వెలువడింది.

పూర్ణియాలోని స్థానికుల కథనం ప్రకారం, ఆ చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ, పూర్ణియాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు రామేశ్వర్ ప్రసాద్ సింగ్, తన సహచరులైన రామ్‌రతన్ సాహ్, షంసుల్ హక్‌లతో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్యం ప్రకటించిన క్షణమే సంబరాలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆగష్టు 14వ తేదీ రాత్రే పూర్ణియాలోని ఝండా చౌక్‌లో వారు ఎంతో ఉత్సాహంతో, గర్వంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మిఠాయిలు పంచుతూ, దేశభక్తి నినాదాలు చేస్తూ మొదటి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు.

ఈ ఘనమైన సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. రామేశ్వర్ ప్రసాద్ సింగ్ ప్రారంభించిన ఈ సంప్రదాయం నేటికీ పూర్ణియాలో సజీవంగా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 14వ తేదీ రాత్రి, నగరం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. ప్రజలు ఇళ్లను, వీధులను, పాఠశాలలను దీపాలతో అలంకరిస్తారు. నగరం అంతటా దేశభక్తి గీతాలు మారుమోగుతాయి. ప్రజలు నగరంలోని ప్రధాన పతాక కూడలి వద్ద తరలివస్తారు. అర్ధరాత్రి, ఒక వైభవోపేతమైన వేడుకలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారతమాతకు వందనం చేస్తారు.

పూర్నియా ప్రజలకు ఇది వారు గర్వపడే ఒక ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఇది వారిని దేశంలోని మిగతా వారి నుండి వేరుగా నిలబెడుతుంది. వారి దేశభక్తి స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *