Headlines

Gold: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టినవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఒకేసారి గ్రాముపై రూ.9 వేల లాభం పొందొచ్చు.. | RBI Announces Early Redemption for Sovereign Gold Bonds, Investors Set for Nearly 200 percent Returns

Gold: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టినవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఒకేసారి గ్రాముపై రూ.9 వేల లాభం పొందొచ్చు.. | RBI Announces Early Redemption for Sovereign Gold Bonds, Investors Set for Nearly 200 percent Returns


బంగారంలో పెట్టుబడి పెట్టినవారికి ఆర్బీఐ భారీ శుభవార్త అందించింది. గతంలో ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేసిన విషయం తెలిసిందే. వీటిల్లో చాలామంది పెట్టుబడులు పెట్టారు. ఇందులో పెట్టుబడులు పెట్టినవారికి ఆర్బీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముందుగా విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం తేదీలను ప్రకటించింది. ముందుగా విత్ డ్రా చేసుకుంటే ఎంత అందుతుందనేది కూడా వెల్లడించింది. సోవరెన్ గోల్డ్ బాండ్ (SGB) 2020-21 సిరీస్ XIలో పెట్టుబడి పెట్టినవారికి ఈ అవకాశం కల్పిస్తోంది. ముందే పెట్టుబడులను ఉపసంహరించుకోవాలనుకునేవారు ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చు. ఆగస్ట్ 7వ తేదీ నుంచి గోల్డ్ బాండ్లను గడువుకు ముందే విమోచించుకునే ఆప్షన్ అందిస్తోంది.

ఆర్బీఐ నుంచి అనౌన్స్‌మెంట్

ఆగస్ట్ 8,9వ తేదీల్లో సెలవులు వస్తున్నాయి. ఆగస్ట్ 8 రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం సెలవులు వచ్చాయి. దీంతో ఆగస్ట్ 7వ తేదీ నుంచే ఆర్బీఐ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. గోల్డ్ బాండ్లు జారీ చేసిన ఐదు సంవత్సరాల తర్వాత.. వడ్డీ చెల్లింపు తేదీన గడువుకు ముందే విమోచనకు అర్హత పొందుతాయి. అలాగే ముందే తీసుకుంటే ఎంత ధర అందుతుందనే వివరాలను కూడా ఆర్బీఐ ప్రకటించింది. ముందస్తు విమోచన ధరను యూనిట్‌కు రూ.14,564గా నిర్ణయించింది. 20-21 సిరీస్-XIకి సంబంధించిన ముందస్తు విమోచన ధరను యూనిట్‌కు ₹14,564గా నిర్ణయించినట్లు ఆర్‌బిఐ పేర్కొంది. ఆగస్టు 4, 5, 6 తేదీలలోని 999 ఖచ్చితత్వం గల బంగారం సగటు ముగింపు ధర ప్రకారం దీనిని నిర్ణయించింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రచురించిన బంగారం ధర ప్రకారం లెక్కించింది. ఆన్‌లైన్ బాండ్లు జారీ చేసినప్పుడు గ్రాముకు రూ.4,862గా ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.14,564గా పలుకుతుండంతో పెట్టుబడిదారులు భారీగా లాభాలు ఆర్జించనున్నారు. యూనిట్‌కు లాభం రూ.9,702గా ఉంది. పెట్టుబడిదారులు సుమారుగా 199.55 శాతం రాబడిని పొందారు.

రూ.లక్ష పెట్టుబడి పెడితే..

ఉదాహరణకు ఒక పెట్టుబడిదారుడు రూ.1 లక్ష పెట్టుబడి పెడితే.. ఇప్పుు సుమారుగా రూ.3 లక్షలు అందుతుంది. దీనికి అదనంగా మొత్తం కాలానికి లభించే 2.5 శాతం వార్షిక వడ్డీ కూడా అదనంగా లభిస్తుంది. ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసిన పెట్టుబడిదారులకు ఈ బాండ్ ధరను గ్రాముకు రూ.4,912గా నిర్ణయించారు.ఆన్‌లైన్ కొనుగోలుదారులకు గ్రాముకు రూ.50 తగ్గింపును అందించారు. సావరిన్ గోల్డ్ బాండ్ల పెట్టుబడిదారులకు వారి ప్రారంభ పెట్టుబడిపై 2.50 శాతం స్థిర వార్షిక వడ్డీ రేటు అందుతుంది. ఈ వడ్డీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మెచ్యూరిటీ సమయంలో అసలు మొత్తంతో పాటు తుది వడ్డీ చెల్లిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *