Headlines

టాల్కమ్ పౌడర్‌తో క్యాన్సర్ వస్తుందా? టాటా మెమోరియల్ సెంటర్ నిపుణుల సంచలన నిజాలు | Can Talcum Powder Cause Cancer? Tata Memorial Centre Experts Explain the Real Risk

టాల్కమ్ పౌడర్‌తో క్యాన్సర్ వస్తుందా? టాటా మెమోరియల్ సెంటర్ నిపుణుల సంచలన నిజాలు | Can Talcum Powder Cause Cancer? Tata Memorial Centre Experts Explain the Real Risk


మనం చిన్నప్పటి నుండి ఇంట్లో నిత్యం ఉపయోగించే వస్తువులలో టాల్కమ్ పౌడర్ ఒకటి. స్వేదాన్ని పీల్చుకోవడానికి, చర్మాన్ని పొడిగా ఉంచడానికి దీనిని విస్తృతంగా వాడతారు. అయితే, గడిచిన కొన్ని ఏళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో టాల్కమ్ పౌడర్ వల్ల అండాశయ క్యాన్సర్ లేదా ఇతర రోగాలు వస్తాయనే వార్తలు విపరీతమైన ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని ప్రముఖ టాటా మెమోరియల్ సెంటర్ (TMC) నిపుణులు ఈ అంశంపై స్పష్టతనిచ్చారు.

అసలు క్యాన్సర్ ప్రమాదం దేనివల్ల వస్తుంది?

టాటా మెమోరియల్ సెంటర్, సెంటర్ ఫర్ క్యాన్సర్ ఎపిడెమియాలజీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గౌరవి మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం… ప్రధాన ప్రమాదం కేవలం టాల్క్ వల్ల కాదని, అందులో కలిసే ఆస్బెస్టాస్ వల్ల ఉంటుందని చెప్పారు. టాల్క్ అనేది భూమి నుండి తవ్వితీసే ఒక సహజ ఖనిజం. మైనింగ్ చేసే సమయంలో టాల్క్‌తో పాటు ఆస్బెస్టాస్ అనే హానికరమైన పదార్థం కూడా లభిస్తుంది. మైనింగ్, శుద్ధి ప్రక్రియ సరిగ్గా జరగకపోతే, పౌడర్‌లో ఆస్బెస్టాస్ కణాలు మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఆస్బెస్టాస్ క్యాన్సర్‌కు కారణమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపించబడింది.

క్రమం తప్పకుండా వాడేవారు భయపడాలా?

అనేక సంవత్సరాలుగా టాల్కమ్ పౌడర్ ఉపయోగిస్తున్న వారు వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ గౌరవి మిశ్రా స్పష్టం చేశారు. సాధారణ టాల్క్ వల్ల క్యాన్సర్ వస్తుందనడానికి తగినన్ని బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవని, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) కూడా దీనిని సంభావ్య ప్రమాద విభాగంలో మాత్రమే ఉంచిందని వివరించారు.

ఇవి కూడా చదవండి



ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి?

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో టాల్కమ్ పౌడర్ ఉపయోగాన్ని నివారించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చిన్న పిల్లలకు వాడేటప్పుడు పిల్లల ముఖం, ముక్కు లేదా నోటి దగ్గర పౌడర్ చల్లేటప్పుడు శ్వాస ద్వారా పౌడర్ కణాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అలాగే, కోతలకు, తెరిచిన గాయాలకు లేదా శస్త్రచికిత్స జరిగిన ప్రదేశాల్లో పౌడర్ వేయకూడదు. చర్మంపై దద్దుర్లు, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు పౌడర్ రాయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. మహిళలు జననేంద్రియాల వద్ద టాల్కమ్ పౌడర్ వాడటాన్ని నివారించడం మంచిది.

కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు లేదా అనుమానాస్పద లక్షణాలు కనిపించే వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. సురక్షితమైన ప్రత్యామ్నాయంగా కార్న్‌స్టార్చ్ ఆధారిత పౌడర్లను ఎంచుకోవడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *