Headlines

Mrunal Thakur : భారత స్టార్ క్రికెటర్‏తో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. ? హీరోయిన్ రిప్లై ఇదే.. | Mrunal Thakur Reacts On Dating Rumors With Cricketer Yashasvi Jaiswal

Mrunal Thakur : భారత స్టార్ క్రికెటర్‏తో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. ? హీరోయిన్ రిప్లై ఇదే.. | Mrunal Thakur Reacts On Dating Rumors With Cricketer Yashasvi Jaiswal


సాధారణంగా సెలబ్రేటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషళ్ మీడియాలో తెగ వైరలవుతుంది. ముఖ్యంగా తారల పర్సనల్ విషయాలు, లవ్, డేటింగ్, మ్యారేజ్, డివోర్స్ గురించి నెటిజన్స్ తెగ ఆరా తీస్తుంటారు. కొన్నాళ్లుగా డేటింగ్ రూమర్స్ ద్వారా నిత్యం వార్తలలో నిలుస్తుంది హీరోయిన్ మృణాల్. ఇటీవల కాలంలో ఆమె డేటింగ్, లవ్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మొన్నటి వరకు కోలీవుడ్ హీరో ధనుష్ తో ప్రేమలో ఉందంటూ ప్రచారం నడిచింది. ఇక ఇప్పుడు యంగ్ క్రికెటర్ పేరు తెరపైకి వచ్చింది. భారత యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ తో ఆమె డేటింగ్ లో ఉందనే ప్రచారం జరిగింది. ముంబైలోని ఓ కాఫీ షాపులో వీరిద్దరూ జంటగా కనిపించారని పుకార్లు నెట్టింట హల్చల్ చేశాయి. అయితే ఈ విషయం కాస్తా మృణాల్ వద్దకు చేరింది. దీంతో తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

జైస్వాల్ తోపాటు తను ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న ఓ వీడియోకు సంబంధించిన ఇన్ స్టా ఖాలో పోస్ట్ కనిపించగా.. ఆ వీడియోకు కామెంట్ చేసింది మృణాల్. ఒకేచోట కనిపించినంత మాత్రాన ఇద్దరి మధ్య సంబంధం ఉందని ఎలా భావిస్తారు.. ఎలా అనుకుంటారు అంటూ గట్టిగానే క్లాస్ పీకింది. “బ్రో… రిలాక్స్.. మేమిద్దరం కలిసి ఎక్కడ కనిపించాం ? మీరు ఇంత చదువుకున్వాళ్లు కానీ ఇలాంటి రూమర్స్ నిజమని ఎలా నమ్ముతున్నారు. దేశంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. జెన్ జీ నుంచి కొంత నేర్చుకోండి. సరైన సమస్యలపై వీడియోలు చేయండి. అప్పుడు మరిన్ని వ్యూ్స్ వస్తాయి ” అంటూ మృణాల్ రిప్లై ఇచ్చినట్లుగా ఒక స్క్రీన్ షార్ట్ వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

ఇదిలా ఉంటే.. మృణాల్ గురించి ఇలాంటి రూమర్స్ రావడం ఇది మొదటి సారి కాదు. గతంలో తమిళ హీరో ధనుష్ తో ఆమె డేటింగ్ లో ఉందని.. త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని కూడా మరోసారి ప్రచారం జరిగింది. ఇక ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మృణాల్ పేరు క్రికెటర్ తో జతకట్టారు. చివరగా తెలుగులో డెకాయిట్ సినిమాతో అలరించింది మృణాల్.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

మృణాల్ రిప్లై..

Mrunal

Mrunal

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *