Headlines

Toxic: డోస్ తగ్గించిన టాక్సిక్ టీమ్‌.. రీజనేంటి? | Yash’s Toxic Unveils Romantic Side with ‘Manasaagade’ Song video – Entertainment Videos in Telugu

Toxic: డోస్ తగ్గించిన టాక్సిక్ టీమ్‌.. రీజనేంటి? | Yash’s Toxic Unveils Romantic Side with ‘Manasaagade’ Song video – Entertainment Videos in Telugu


గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. సెకండ్ సింగిల్‌గా రిలీజైన రొమాంటిక్ ట్రాక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఇచ్చిన అప్‌డేట్స్‌తో సినిమా మీద ఓ ఇమేజ్‌ క్రియేట్ చేసిన మేకర్స్ లేటెస్ట్‌ సాంగ్‌తో ఆ టోన్‌ను కాస్త డౌన్‌ చేశారు. ఎలా అనుకుంటున్నారా.? అయితే వాచ్‌ దిస్ స్టోరి. యాక్షన్ రోల్స్‌తో మాస్ ఆడియన్స్‌ను మెప్పించిన యష్, ‘టాక్సిక్’లో తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను కూడా పరిచయం చేయబోతున్నారు. తెలుగులో మనసాగదే పేరుతో విడుదలైన ఈ సాంగ్‌లో యష్, తారా సుతారియా కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచింది. స్క్రీన్ మీద వీళ్లిద్దరి పెయిర్ చూసి, ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. యష్‌ను కొత్త లుక్‌లో చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. విజువల్స్ మాత్రమే కాదు.. ఈ సాంగ్ మ్యూజిక్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. విజువల్స్‌కి తగ్గట్లుగా మ్యూజిక్ కూడా మనసుకు హత్తుకునేలా ఉండటంతో, రిలీజైన కొద్ది నిమిషాల్లోనే ఈ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా మారింది. ఈ సాంగ్‌లో యష్, తారాల రొమాన్స్‌తో పాటు నయనతార, కియారా అద్వానీలను కూడా చూపించారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్స్ అన్నింటిలోనూ బోల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువగా ఉందన్న విమర్శలు వినిపించాయి. అందుకే లేటెస్ట్ సాంగ్‌లో ఆ టోన్‌ను కాస్త తగ్గించారు. గ్రాండ్ విజువల్స్‌లో పాటు హీరోయిన్ల రిలేషన్‌ మీద ఫోకస్ చేస్తూ డిజైన్ చేసిన ఈ సాంగ్‌ ఇన్‌స్టాంట్‌గా వైరల్ అవుతోంది. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమాను ఆగస్టు 26న భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *