Headlines

DC Movie: లోకేశ్ కనగరాజ్ ‘డీసీ’ సినిమాను ఆ టాలీవుడ్ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడా? నెట్టింట వీడియో వైరల్ | Is This Tollywood Actor Was The First Choice For Lokesh Kanagaraj Role In DC Movie, Details Here

DC Movie: లోకేశ్ కనగరాజ్ ‘డీసీ’ సినిమాను ఆ టాలీవుడ్ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడా? నెట్టింట వీడియో వైరల్ | Is This Tollywood Actor Was The First Choice For Lokesh Kanagaraj Role In DC Movie, Details Here


లోకేష్ కనకరాజ్, వామిక గబ్బి జంటగా అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా డీసీ. ఆగస్టు 07న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ రెండో రోజుకు బాగా పుంజుకుంది. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మౌత్ టాక్‌తోనే వసూళ్లు పెంచుకుంటుంది. ఆన్ లైన్ టికెటింగ్ యాప్స్‌లో ట్రెండ్ అవుతోంది. వీకెండ్ అయిపోయిన తర్వాత కూడా లాంగ్ రన్‌లోనూ ‘DC’ మ్యాజిక్ జరిగేలా ఉంది. ముఖ్యంగా రాక్ స్టార్ అనిరుధ్ సంగీతం ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. అయితే ఈ డీసీ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే ఈ రా అండ్ రస్టిక్ సినిమాకు హీరోగా లోకేశ్ కనగరాజ్ మొదటి ఛాయిస్ కాదంట. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా చేయాల్సిందట. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ తమిళ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ను నేను రెండు సార్లు. ఆయన నాకు ఒక ఆసక్తికరమైన కథ చెప్పాడు. అయితే అదే టైమ్ లో నేను చేస్తోన్న సినిమా స్టోరీ.. అరుణ్ కథకు దగ్గర పోలికలు ఉండడంతో నేను ఒకే చెప్పలేకపోయాను’ అని చెప్పుకొచ్చాడు. రౌడీ బాయ్ కింగ్‌డమ్ సినిమా ప్రమోషన్స్ లో ఈ కామెంట్స్ చేశాడు. అంటే ఈ సినిమా చేస్తోన్న టైమ్ లోనే అరుణ్ మాతేశ్వరన్ విజయ్ ని కలిసి డీసీ సినిమా కథ చెప్పాడని తెలుస్తోంది. అయితే రెండూ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు కావడంతో అరుణ్ మాతేశ్వరన్ సినిమాకు విజయ్ ఒకే చెప్పలేదని తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పుడీ విషయం నెట్టింట బాగా వైరలవుతోంది. ఒక వేళ విజయ్ దేవరకొండ ఈ సినిమా చేసి ఉంటే ఫలితం ఎలాగుండేదోనని అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి



నెట్టింట వైరలవుతోన్న విజయ్ దేవరకొండ వీడియో ఇదే..

సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన డీసీ సినిమాలో సంజన కృష్ణమూర్తి, వామికా గబ్బి, అవినాష్ రఘుదేవన్, కస్తూరి రాజా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రాక్ స్టార్ అనిరుధ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.

 లోకేశ్ కనగరాజ్ డీసీ సినిమా ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *