Ravindra Jadeja Kuldeep Yadav Mimicry: ఎప్పుడూ గంభీరంగా ఉండే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముఖంలో నవ్వులు పూయించడం ఎవరి వల్లా కాకపోవచ్చు, కానీ మన ‘సర్’ రవీంద్ర జడేజాకు అది చిటికెలో పని. డ్రెస్సింగ్ రూమ్‌లో తోటి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ యాక్షన్‌ను జడేజా అనుకరించి చూపించిన తీరుకు గంభీర్ పడిపడి నవ్వడం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభానికి ముందు కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంక ఎలెవెన్‌తో భారత జట్టు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. రెండో రోజు ఆట సందర్భంగా డగౌట్లో కూర్చున్న రవీంద్ర జడేజా సరదా మూడ్‌లోకి వెళ్లిపోయారు. తోటి చైనామెన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విసిరే బౌలింగ్ రనప్, రొటేషన్, వికెట్ తీసే ముందు ముఖంలో పెట్టే హావభావాలను జడేజా అచ్చుగుద్దినట్లు అనుకరించి చూపించారు. మైదానంలోనూ, బయటా ఎంతో సీరియస్‌గా కనిపించే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, జడేజా కామెడీ టైమింగ్ చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. సోనీ లివ్ పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
ఎక్కువమంది చదివినది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?
బ్యాట్‌తో చెలరేగిన ఆల్‌రౌండర్ జడేజా..
#1 All-rounder for a reason.😂
Ravindra Jadeja can bat, bowl, field, and apparently, crack Gautam Gambhir too. 😆
Watch Day 3 of SLC XI vs #TeamIndia tomorrow, 10 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/TWbJzVPEed
— Sony Sports Network (@SonySportsNetwk) August 8, 2026
కేవలం నవ్వించడమే కాకుండా మైదానంలో బ్యాట్‌తోనూ జడేజా సత్తా చాటారు. మిడిల్ ఆర్డర్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా 7 బౌండరీలతో 63 పరుగులు సాధించి జట్టుకు కొండంత అండగా నిలిచారు. యంగ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి రిటైర్డ్ అవుట్‌గా వెనుతిరిగారు. ఆ తర్వాత ఆఖరి ఓవర్లో పంజాబ్ పేసర్ గుర్నూర్ బ్రార్ వరుసగా 4 సిక్సర్లు బాది 18 బంతుల్లో 36 పరుగులతో నాటౌట్‌గా నిలవడం చూసి గంభీర్ ఎంతో ఆనందించారు.
పడిక్కల్ మెరుపు శతకం.. విఫలమైన పంత్, జైస్వాల్..
భారత ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్ నాటౌట్ 142 పరుగులతో కంబ్యాక్ ఇచ్చి గాల్ టెస్టులో మూడో స్థానానికి తన దావాను గట్టిగా వినిపించారు. తొలి బంతికే డకౌట్‌గా నిష్క్రమించిన యశస్వి జైస్వాల్ నిరాశపరచగా, కేఎల్ రాహుల్ 40 పరుగులు చేసి రాణించారు. వికెట్ కీపర్ రిషభ్ పంత్ (2), ధ్రువ్ జురెల్ (1) తీవ్రంగా విఫలమయ్యారు. యువ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ 41 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు సాధించి లంక స్కోరుకు దగ్గరగా వచ్చింది.
ఎక్కువమంది చదివినది: ఇది ఇండియన్ టీమా లేక హాస్పిటల్ వార్డా..? ఆ దెబ్బకు రంగంలోకి బిగ్ బాస్..!
సమిష్టిగా రాణించిన స్పిన్ విభాగం..
శ్రీలంక ఎలెవెన్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 363/8 వద్ద డిక్లేర్ చేసింది. భారత పేస్ విభాగంలో మహమ్మద్ సిరాజ్ తప్ప అనుభవం ఉన్న బౌలర్లు లేకపోవడంతో ప్రధాన బరువు అంతా స్పిన్నర్లపైనే పడింది. జడేజా (2/64), కుల్దీప్ యాదవ్ (2/76), మానవ్ సుతార్ (2/33) తలా రెండు వికెట్లు పడగొట్టి సమిష్టిగా మెప్పించారు. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ జడేజా అద్భుత ప్రదర్శన చేయడం రాబోయే టెస్ట్ సిరీస్‌కు భారత్‌కు పెద్ద సానుకూలాంశం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..