Headlines

తెలంగాణ నయాగరాకు పోటెత్తిన జనం.. పాలధారలా జాలువారుతున్న బొగత జలపాతాలు.. మినీ జాతరను తలపిస్తున్న దృశ్యాలు! | Telangana Niagara Turns Into a Mini Fair: Tourists Flock to Bogatha Waterfalls Amidst Spectacular Rains

తెలంగాణ నయాగరాకు పోటెత్తిన జనం.. పాలధారలా జాలువారుతున్న బొగత జలపాతాలు.. మినీ జాతరను తలపిస్తున్న దృశ్యాలు! | Telangana Niagara Turns Into a Mini Fair: Tourists Flock to Bogatha Waterfalls Amidst Spectacular Rains


వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో జలపాతాలు పాలధారలా జాలువారుతున్నాయి. చూపరులను కనువిందు చేస్తున్నాయి.. జలపాతాల సందర్శనకు ఇప్పుడు జనం పరుగులు పెడుతున్నారు. వరుస సెలవులు కలిసి రావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చి తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణ నయాగరా బొగత జలపాతాలు జాతరను తలపిస్తున్నాయి. తెలంగాణ నయాగరా బొగత జలపాతాలు మేడారం మినీ జాతరను తలపిస్తున్నాయి. 50 అడుగులు ఎత్తు నుంచి పాలధారలా జాలువరుతున్న జలపాతాలను వీక్షించేందుకు జనం పరుగులు పెడుతున్నారు. జలపాతాలలో జలకాలాడుతూ తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ ఏడాది జలపాతాలకు కాస్త ఆలస్యంగా జలకళ సంతరించుకుంది. వర్షాలు కాస్త ఆలస్యమైనా వస్తూ వస్తూనే అత్యంత ప్రమాదకరంగా వరద ఉధృతితో జలపాతాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో గత వారం జలపాతాల సందర్శనకు ఎవ్వరినీ అనుమతించ లేదు. ప్రమాదాలు పొంచి ఉండడంతో జలపాతాల సందర్శనకు అనుమతి నిలిపివేశారు.

ప్రవాహ ఉధృతగ్గడంతో తిరిగి జలపాతాల సందర్శనకు అనుమతిస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతాలు ప్రస్తుతం మినీ జాతరను తలపిస్తున్నాయి. చూడడానికి కన్నుల విందుగా కనిపిస్తున్నాయి. ఎంతదూరం ప్రయాణం చేసినా ఈ జలపాతాలు కంటపడితే చాలు ఆ అలసట మరిచిపోయి తన్మయత్వంతో ఉప్పొంగిపోయేలా జాలువారుతున్నాయి. చూడగానే ఆహా అనిపించే బోగత జలపాతాలలో సందర్శకులు తినివితీరా ఎంజాయ్ చేస్తున్నారు.

జలపాతాలలో జలకాలాడుతూ కేరింతలు కొడుతున్నారు. పక్కనే అటవీశాఖ ఏర్పాటు చేసిన పార్క్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. వాచ్ టవర్ ఎక్కి కేరింతలు కొడుతున్నారు. ఈ నీళ్లలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయని జలకళతలతో పరవశించి పోతున్నారు. కేవలం బోగత జలపాతాల సందర్శనకు మాత్రమే అటవీశాఖ అధికారులు అనుమతిస్తున్నారు. మిగిలిన ఆరు జలపాతాల సందర్శనకు అనుమతి నిలిపివేశారు. ఎవరైనా దొంగదారిలో నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.

ఇటు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భీముని పాదం జలపాతాలకు కూడా జనం పోటెత్తారు. పాలధారలా జాలువారుతున్న జలపాతాల వద్ద జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మూడు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగింది.

వీడియో చూడండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *