
బంగారం కొనుగోలు చేసే వారికి ఇదో స్వల్ప ఊరట అనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులు పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. శనివారంతో పోల్చుకుంటే ఈ ఆభరణాల ధరల్లో పెద్దగా పెరుగుదల కనిపించలేదు.. పైగా ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ విలువ మారకం కారణంగా ధరల్లో ఈ మార్పులు వచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర చూస్తే.. రూ.1,52,340 వద్ద కొనసాగుతుండగా.. నిన్న ఉదయం ఈ ధర రూ.1,52,350గా ఉంది. ఇక 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,640గా ఉండగా నిన్న ఈ ధర రూ.1,39,650 వద్ద కొనసాగింది. ఇక అటు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. శనివారంతో పోల్చుకుంటే వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,49,800గా ఉండగా నిన్న ఈ ధర రూ.2,49,900 వద్ద కొనసాగింది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇవే
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,640 వద్ద ట్రేడవుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,640 వద్ద ట్రేడవుతోంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,540 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,840 వద్ద ట్రేడవుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,640 వద్ద ట్రేడవుతోంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,640 వద్ద ట్రేడవుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,630 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,990 వద్ద ట్రేడవుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి