Headlines

Illu Illalu Pillalu August 10th Episode: దొంగపెళ్లి చేయడానికే వచ్చారా? రెచ్చగొట్టేసిన సేనాపతి.. రామరాజు కౌంటర్‌ .. ధీరజ్‌ పేరు, గోత్రం దాటేసిన ప్రేమ | Illu Illalu Pillalu August 10th Episode Review, Prema Avoids Deeraj Name in Temple, Valli Plans With Bhadravathi

Illu Illalu Pillalu August 10th Episode: దొంగపెళ్లి చేయడానికే వచ్చారా? రెచ్చగొట్టేసిన సేనాపతి.. రామరాజు కౌంటర్‌ .. ధీరజ్‌ పేరు, గోత్రం దాటేసిన ప్రేమ | Illu Illalu Pillalu August 10th Episode Review, Prema Avoids Deeraj Name in Temple, Valli Plans With Bhadravathi


Illu Illalu Pillalu August 10th Episode Review:

ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి చీర సారె పెట్టి మొక్కాలని రామరాజు, భద్రావతి గడికి వెళతారు. పగతో రగిలిపోతున్న సేన .. రామరాజును మాటలతో రెచ్చగోడతాడు. ఎత్తుకు పై ఎత్తులు వేసే భద్రావతి ప్రేమను కంట్రోల్‌లో పెట్టుకుంటుంది. గుడిలో ధీరజ్ తో ప్రేమను కలపాలనే వేదవతి ప్లాన్‌ను అడ్డుకుంటుంది. ఇదీ ఇవాళ్టి ఎపిసోడ్‌ సంక్షిప్తంగా.. ఇక వివరాల్లోకి వెళితే.. స్పెషల్‌ క్లాస్‌కి వెళ్లాలి నేను గుడికి రాలేను అంటున్న ప్రేమను ఎలాగైనా ఒప్పించాలి .. గుడికి తీసుకెళ్లాలి అని అన్న విశ్వ ప్రయత్నిస్తుంటాడు. గుడి్కి వెళ్లడానికి భద్రావతి, రామరాజు రెడీ అవుతారు. ప్రేమ కాలేజీకి బయలుదేరుతుంది. రాత్రి మీ ఆయన నన్ను ఎగతాళి చేసాడు అని ప్రేమను రెచ్చగొడతాడు అన్న విశ్వ. ప్రేమ ఆవేశపడిపోయి ఏమన్నాడో చెప్పు అని నిలదీస్తుంది. నాతో మళ్లీ ప్రేమలో పడిపోతుందనే భయంతో రేపు మీ చెల్లెలు గుడికి రాదు. అని ఎగతాళి చేసాడు అంటాడు విశ్వా. ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడు..అదంతా వాడి భ్రమ .. నేనేంటో చూపిస్తా.. గుడికి వస్తా అంటుంది ప్రేమ.

Illu Illalu Pillalu Serial

Illu Illalu Pillalu Serial

రామరాజు కుటుంబం ఆటోలో.. భద్రావతి, సేన, ప్రేమ, కారులో దిగుతారు. ఫ్యామిలీ అంతా కట్టకట్టుకుని గుడికి దొంగ పెళ్లి చేయడానికి వచ్చారా ..మొక్కడానికి వచ్చారా.. అని సేన రామరాజుతో అంటాడు. డబ్బున్న అమ్మాయిని లేపుకెళ్లి గుడిలో పెళ్లి చేసుకోవడం.. అయ్య దగ్గర నుంచి కొడుకుల దాకా .. మీకు ఫ్యామిలీ బిజినెస్‌ కదా అంటాడు. దానికి ధీరజ్‌ ఏయ్‌ అంటూ వార్నింగ్‌ ఇస్తుంటే.. రెచ్చగొట్టేలా అరుపులు మాటలు మనకు వినిపిస్తాయి .. అవన్నీ పట్టించుకుంటే మన విలువ తగ్గుతుంది. ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి వెళదాం అంటాడు రామరాజు. ఎలాగోలా ప్రేమ, ధీరజ్‌ను కలపాలని అనుకుంటాడు విశ్వా. చెల్లిని ధీరజ్ వైపుకు బలంగా నెట్టి యాక్సిడెంటల్‌గా జరిగినట్లు నటిస్తాడు. ప్రేమ పడకుండా ధీరజ్‌ పట్టుకుంటాడు. ధీరజ్ చేతుల్లో ప్రేమను చూసి.. రామరాజు కుటుంబం సంతోషిస్తే.. వల్లి మాత్రం షాకవుతుంది. ప్రేమా.. ఏంటలా పడిపోయావు .. అని భద్రావతి తీసుకెళుతుంది. మొగుడికి దూరంగా ఉండలేకపోతోంది.. ప్రేమ ఎక్కువై ధీరజ్ పై పడింది.. రామరాజు కోడలు నర్మద అంటుంది. అదేం లేదు అక్కా.. కాలు తట్టుకుని పడ్డాను.. ప్రేమ అంటుంది. తన ముందు నడుస్తున్న భద్రావతిని.. కాస్త పక్కకు రండి .మీకో రహస్యం చెప్పాలి.. వల్లి అంటుంది.

Illu Illalu Pillalu

Illu Illalu Pillalu

రామరాజు వాళ్లు గుడికొచ్చింది పంతులు పెట్టిన ప్రసాదాన్ని కళ్లకద్దుకుని తినడానికి కాదు. కుట్రలు చేయడానికే.. ప్రేమ, ధీరజ్‌ను కలపాలన్నది వాళ్ల ప్లాన్‌ .. భద్రావతితో అంటుంది వల్లి. వాళ్లు అంతకు తెగించారా అంటే.. మెయిన్ విలన్‌గా ఉండాల్సిన మీరు ఇంకా కారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే మిగిలిపోయారు అంటుంది. మనం ఏం చేయాలో చెప్పు అంటే ..వాళ్లు ప్రేమను కలవకూడదు. కలిస్తే ప్రేమ మీ మాట వినకుండా చేస్తారు వల్లి అంటుంది. అత్త వేదవతి బలవంతం మీద .. ప్రేమ పక్కకు వెళ్లి నిల్చుంటుంది కోడలు నర్మద. ప్రేమా నీకో విషయం చెప్పాలి అంటుంది. వల్లి హెచ్చరించడంతో అలర్టవుతుంది భద్రావతి. పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమ నర్మదను దూరం చేస్తుంది. నర్మదపై విరుచుకుపడుతుంది. నువ్వేంటి ఇక్కడ పక్కకు వెళ్లు అంటుంది. ఇదేదో మీ రాజ్యం అన్నట్లుగా పక్కకు వెళ్లు అంటున్నారు. దేవుడు ఇక్కడ్నుంచి బాగా కనబడతాడని ఇటు వచ్చాను అని కౌంటర్‌ వేస్తుంది కోడలు నర్మద.

Illu Illalu Pillalu Serial

Illu Illalu Pillalu Serial

నర్మద ఇచ్చిన పంచ్‌కు వేదవతి సంతోషిస్తుంది. పేర్లు గోత్రనామాలు చెప్పాలని పూజారి అంటారు. ప్రేమ భర్త పేరు అడిగితే చెప్పకుండా దాటేస్తుంది. భర్త పేరు చెప్పకపోతే అశుభం అంటారు పూజారి. ప్రేమ చూపించే యాటిట్యూడ్‌కి మామ రామరాజు నొచ్చుకుంటాడు. పర్లేదు నా ఒక్కదాని పేరు మీదే అర్చన చేయండి పూజారిగారు అంటుంది ప్రేమ. ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమించాను.. ఒక్క రోజులో నా పై అంత ద్వేషం ఎందుకు పెంచుకున్నావు ప్రేమా అని ధీరజ్‌ బాధపడుతుంటాడు. తన ప్లాన్‌ సక్సెస్‌ కావడంతో వల్లి నవ్వుకుంటుంది. అంతలో ఘోరం జరిగిపోతుంది. తాటాకుల కప్పు ధీరజ్‌ మీద పడుతుంది. తలకు గాయమై రక్తం కారుతుంది. అయ్యె అంటూ పరిగెత్తుకొస్తుంది తల్లి వేదవతి. నుదుటి పై గాయాన్ని తన చీర కొంగుతో అద్దుతూ ఏడుస్తుంటుంది. ధీరజ్‌కి గాయం కావడం చూసిన ప్రేమ తట్టుకోలేకపోతుంది. ధీరజ్‌కి ఏమైందో దగ్గరికి వెళ్లి చూడాలని అనుకుంటుంది. కానీ తప్పని పరిస్థితుల్లో అక్కడే నిలబడిపోయి కంట కన్నీరు కార్చుతుంది. ధీరజ్‌ను ప్రేమగా చూస్తూ ఉంటుంది. దాంతో ఇవాళ్టి ఈ రోజు ఎపిసోడ్‌ ఎండ్‌ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *