Headlines

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్‌ CDP కుమార్తె మృతి!

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్‌ CDP కుమార్తె మృతి!


గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్‌ CDP కుమార్తె మృతి!

విజయవాడ, ఆగస్ట్ 10: గుంటూరు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షరీన్‌ బేగం కుమార్తె హఫీసా బేగం (24) మృతి చెందారు. ఆమెతో పాటు కారులో తాడేపల్లికి చెందిన ఉండి రుత్విక్‌ (జిమ్‌ నిర్వాహకుడు), అవినాష్, సుధీర్, షేక్‌ ఆసిఫా, వంశీ స్నేహితులు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒకరు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపిన వివరాల ప్రకారం..

హఫీసా బేగం తన స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు వెళ్తున్న లారీ సడెన్‌గా బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి ఢీ కొట్టి రోడ్డు పక్కనున్న డివైడర్‌ను తాకి ఆగిపోయింది. హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది అక్కడికి వచ్చి క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆసిఫా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు గుంటూరు ఎస్పీ తెలిపారు.

ఇదిలా ఉండగా.. విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షరీన్‌ బేగం ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం కోలుకుని తిరిగి విధుల్లో చేరారు. ఆమె విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో కుమార్తె హఫీసా బేగం మృతి చెందిన విషాద వార్త కుటుంబ సభ్యులు, సహచరులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, లారీని కారు ఢీకొన్న కారణాలపై నల్లపాడు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *