Headlines

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్ | Low Pressure System Effect: Rain Forecast for Andhra Pradesh and Telangana for Three More Days

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్ | Low Pressure System Effect: Rain Forecast for Andhra Pradesh and Telangana for Three More Days


బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉంటుంది. దీని ప్రభావంతో, ఆగస్టు 12, 2026 నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మధ్య, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర భారతదేశ ద్వీపకల్పము మీదుగా సుమారుగా 22° ఉత్తర అక్షాంశం వెంబడి ఒక షియర్ జోన్ సగటు సముద్ర మట్టానికి 3.1 మరియు 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణం వైపుకు వంగి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం;-

సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్ ;-

సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ:-

సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

సోమవారం విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని.. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా మాడుగుల, చోడవరం, భీమునిపట్నం, అనంతగిరి, ఎస్ కోట, కొత్తవలస, అనకాపల్లి, విశాఖపట్నం పరిసరప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో వర్షాలు..

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

వాతావరణ సూచన (FORECAST):

సోమవారం, మంగళవారం, బుధవారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులలో క్రింది స్థాయి ఉపరితల గాలుల వేగం 30 నుంచి 40 కి.మీ వరకు కొన్ని ప్రాంతాలలో కొనసాగే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *