Headlines

చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌.. బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు | police case registered against singer Rahul Sipligunj in Visakhapatnam

చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌.. బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు | police case registered against singer Rahul Sipligunj in Visakhapatnam


విశాఖలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పెళ్లి వివాదంలో బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. రాహుల్ రెడ్డి బంధువుగా పరిచయం చేసుకుని బెదిరించారంటూ ఆ యువతి ఆరోపించింది. పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి చేశారంటూ ఫిర్యాదుపేర్కొంది. అలాగే తనను బెదిరించి వీడియో స్టేట్‌మెంట్ ఇప్పించారంటూ ఆరోపించింది. దాంతో రాహుల్ సిప్లిగంజ్ సహా 11 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బ్లాక్‌మెయిల్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొంది ఆ యువతి.
వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు ప్రచారం చేశారంటూ ఆరోపిస్తూ.. తన పరువు, వ్యక్తిగత జీవితానికి నష్టం కలిగించారంటూ యువతి ఫిర్యాదులో తెలిపింది. యువతి ఫిర్యాదుతో విశాఖలోని MVP పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. పలు BNS సెక్షన్లతో పాటు IT యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *