Headlines

Lokesh Kanagaraj: కథలు రెడీ.. హీరోలు బిజీ! టాలీవుడ్‌లో దర్శకులకు తప్పని ‘వెయిటింగ్ గేమ్’ | Tollywood Directors Waiting for Busy Heroes to Bring Their Ready to Go Projects to Sets video – Entertainment Videos in Telugu

Lokesh Kanagaraj: కథలు రెడీ.. హీరోలు బిజీ! టాలీవుడ్‌లో దర్శకులకు తప్పని ‘వెయిటింగ్ గేమ్’ | Tollywood Directors Waiting for Busy Heroes to Bring Their Ready to Go Projects to Sets video – Entertainment Videos in Telugu


చేతిలో కథ సిద్ధంగా ఉండి.. హీరోల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాలంటే ఆ దర్శకుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఊహించుకోండి..? టాలీవుడ్‌లో కొందరు దర్శకుల పరిస్థితి ఇలాగే ఉందిప్పుడు. చేతిలో కథ ఉంది.. దానికి ఓకే చెప్పిన హీరో కూడా ఉన్నాడు.. కానీ ఆ హీరో ఖాళీగా లేడు. దాంతో వాళ్లకు ఎదురుచూపులు తప్పట్లేదు. మరి అలా ఎదురు చూస్తున్న దర్శకులెవరో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? టాలీవుడ్‌లో విచిత్రమైన ట్రెండ్ నడుస్తోందిప్పుడు. కథలు సిద్ధంగా ఉన్నా.. హీరోలు మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారు. సుకుమార్‌నే తీసుకుంటే.. పుష్ప 2 విడుదలై రెండున్నరేళ్లు దాటింది. రామ్ చరణ్ కోసం పక్కా స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. కానీ ఈ ప్రాజెక్ట్ మొదలవ్వడానికి మరో మూన్నెళ్లు పట్టేలా కనిపిస్తోంది. మొన్నటి వరకు పెద్దితో బిజీగా ఉన్న చరణ్.. ఇప్పుడు సర్జరీ కారణంగా రెస్ట్ తీసుకుంటున్నారు. కొరటాల శివ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే తయారైంది. బాలయ్యతో ఆయనకు కమిట్‌మెంట్ ఉన్నా డేట్స్ ఎప్పుడిస్తారో.. సెట్‌కి ఎప్పుడొస్తారో తెలియని కన్ఫ్యూజన్ నడుస్తోంది. అటు దేవర 2 స్క్రిప్ట్ కూడా పక్కాగా సిద్ధమైనా జూనియర్ ఎన్టీఆర్ ఏమంటారో తెలియట్లేదు. దాంతో నందమూరి హీరోలతో కొరటాలకు ఎదురుచూపులే మిగిలాయి. స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ చేతిలో రెండు క్రేజీ స్టోరీలున్నా.. అవి ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కనిపించట్లేదు. నాని తన ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉండగా.. అటు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సుజీత్‌కు వెయిటింగ్ తప్పట్లేదు. దీనివల్ల ఇటు బ్లడీ రోమియో.. అటు ఓజి 2 లాంటి క్రేజీ సినిమాల షూటింగ్స్ మరింత ఆలస్యమయ్యేలా ఉన్నాయి. కథ సిద్ధంగా ఉన్నా అల్లు అర్జున్ ఖాళీ లేకపోవడంతో లోకేష్ కనకరాజ్ ఏకంగా ‘డిసి’ సినిమాతో హీరోగా మారిపోయారు. మరోవైపు రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ కోసం హసిత్ గోలీ కథ రాసుకున్నా.. వాళ్లిద్దరూ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలా దర్శకులంతా కథలు సిద్ధం చేసుకుని తమ హీరోలు ఫ్రీ అయ్యే సుముహూర్తం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రాఫిక్‌లో పైలట్‌.. విమానంలో 175 మంది ప్రయాణికులు

భారతీయ టెక్కీలకు బిగ్‌ షాక్‌.. గ్రేస్ పిరియడ్ రద్దు!

రెంట్ బాయ్‌ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల.. డిస్కౌంట్‌ ఆఫర్లతో నిండా ముంచేస్తున్నారు

Gold Prices: పసిడి ప్రియులకు షాక్‌.. బంగారం కొనాలా? వద్దా? నిపుణులు ఏం చెబుతున్నారు?

ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *