Headlines

The Paradise: రక్తపాతానికి కేరాఫ్ అడ్రస్‌గా నాని ‘ది ప్యారడైజ్’ | Indian Cinema’s New Trend: Nani, Yash, Rajinikanth and Dhanush Lead a Wave of Violent Blockbusters video – Entertainment Videos in Telugu

The Paradise: రక్తపాతానికి కేరాఫ్ అడ్రస్‌గా నాని ‘ది ప్యారడైజ్’ | Indian Cinema’s New Trend: Nani, Yash, Rajinikanth and Dhanush Lead a Wave of Violent Blockbusters video – Entertainment Videos in Telugu


వైలెంట్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ మోత మోగిపోతుంది.. ఏదో ఒక్క ఇండస్ట్రీ అంటే ఏమో అనుకోవచ్చు కానీ మొత్తం అన్ని ఇండస్ట్రీలు ఇదే బాట పడుతున్నాయి. నెలకో సినిమా చొప్పున బాక్సాఫీస్‌ను రక్తంతో దిష్టి తీస్తున్నారు మన హీరోలు. తెలుగులో నాని ఆ బాధ్యత తీసుకున్నారు.. మరి కన్నడ, తమిళం, హిందీలో రక్తపాతపు రాజెవరో చూద్దామా..? ప్యారడైజ్ గురించి ముందు నుంచి నాని చెప్తూనే ఉన్నారు.. ఇది పెద్దల సినిమా చిన్న పిల్లలకు నాట్ అలోడ్ అని..! ఆ అలాగే అంటాడులే రక్తపాతం తక్కువగానే ఉంటుందేమో అనుకున్నారు ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్. కానీ టీజర్ చూసాక నాని చెప్పింది అక్షరాలా నిజమైంది.. అందులో వైలెన్స్ చూసాక ఆ బ్లడ్ బాత్ ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. సెప్టెంబర్ 24న సినిమా రానుంది. నాని కంటే ముందే ఆగస్టులో రక్తపాతం సృష్టించే బాధ్యత యశ్ తీసుకుంటున్నారు. ఈయన నటిస్తున్న టాక్సిక్ ఆగస్ట్ 26న రానుంది. గీతూమోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు రొమాన్స్ డోస్ కూడా కాస్త ఎక్కువే. టీజర్స్, మేకింగ్, సాంగ్స్ ఏదిచ్చినా.. ఎక్స్‌ట్రీమ్‌గానే ఇవ్వాలని ఫిక్సైపోయారు యశ్ అండ్ టీం. ఇది క్లిక్ అయితే ఇండియన్ బాక్సాఫీస్ ఎరుపెక్కడం ఖాయం. అక్టోబర్‌లోనూ రక్తపాతానికి లోటేం లేదు. ఈసారి తమిళ ఇండస్ట్రీ నుంచి మామా మామా అల్లుళ్లు రజినీ, ధనుష్ ఆ బాధ్యత తీసుకుంటున్నారు. అక్టోబర్ 15న జైలర్ 2తో రజినీ వస్తుంటే.. మరుసటి రోజే ధనుష్ ఓంతో వైలెంట్ బొమ్మ చూపించబోతున్నారు. అలాగే డిసెంబర్‌లో ప్రభాస్ ఫౌజీ, షారుక్ ఖాన్ కింగ్ కూడా వైలెన్స్‌తోనే నిండిపోయాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రాఫిక్‌లో పైలట్‌.. విమానంలో 175 మంది ప్రయాణికులు

భారతీయ టెక్కీలకు బిగ్‌ షాక్‌.. గ్రేస్ పిరియడ్ రద్దు!

రెంట్ బాయ్‌ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల.. డిస్కౌంట్‌ ఆఫర్లతో నిండా ముంచేస్తున్నారు

Gold Prices: పసిడి ప్రియులకు షాక్‌.. బంగారం కొనాలా? వద్దా? నిపుణులు ఏం చెబుతున్నారు?

ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *