Headlines

ఇది కదా కావాల్సింది..! ఇరుముడి ట్రైలర్ అదిరిపోయిందిగా.. ఈసారి రవితేజ హిట్ కొట్టడం ఖాయం | Ravi Teja, Priya Bhavani Shankar Irumudi Official Telugu Trailer

ఇది కదా కావాల్సింది..! ఇరుముడి ట్రైలర్ అదిరిపోయిందిగా.. ఈసారి రవితేజ హిట్ కొట్టడం ఖాయం | Ravi Teja, Priya Bhavani Shankar Irumudi Official Telugu Trailer


మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇరుముడి. రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమర్షియల్ హీరో అయినప్పటికీ ఆయన చేసిన ప్రయోగాలు, డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల రవితేజ నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఈ ఏడాది సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ సీనియర్ హీరో. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. అయితే ఇప్పటివరకు తన కెరీర్ లో ఎక్కువగా మాస్ సినిమాలు చేసిన రవితేజ ఈసారి డిఫరెంట్ సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఇరుముడి అనే ఓ డివోషనల్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడీ మాస్ మహారాజ.

ఇది కూడా చదవండి : అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..! ఈ నటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

గతంలో మజిలి, నిన్నుకోరి వంటి ప్రేమకథా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. . మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ దగ్గర నుంచి సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఇది కూడా చదవండి : సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది: నాగార్జున

తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఆ అంచనాలను తారా స్థాయికి చేర్చింది. ఈ సినిమాలో రవితేజ మరోసారి తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. మాస్ సీన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టారు రవితేజ. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇరుముడి సినిమాతో మరోసారి  రవితేజ హిట్ కొట్టడం పక్కా అని తెలుస్తుంది. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి : అయ్యో పాపం.. కళ్ళు చిదంబరం కళ్ళ వెనక ఇంతా కథ ఉందా.! తెలిస్తే షాక్ అవుతారు



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *