Headlines

విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండపైకి ఎక్కుతున్న నీరు.. ఆంధ్రాలో అద్భుతం.. | No Electricity, Diesel or Motor: East Godavari Delta Farmer Hydro Ram Pump Lifts Water Uphill Watch Video

విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండపైకి ఎక్కుతున్న నీరు.. ఆంధ్రాలో అద్భుతం.. | No Electricity, Diesel or Motor: East Godavari Delta Farmer Hydro Ram Pump Lifts Water Uphill Watch Video


విద్యుత్ లేదు.. డీజిల్ లేదు.. మోటార్ లేదు.. అయినా నీరు కొండపైకి ఎక్కుతోంది.. అవును మీరు దీనిని కచ్చితంగా నమ్మాల్సిందే.. మాయ కాదు.. మంత్రం కాదు.. ఒక గ్రామీణ రైతు మేధస్సు.. ఈ కథనం చదివితే మీ ఆలోచనలన్నీ మారిపోతాయి.. రైతు పేరు శ్రీనివాస్… తూర్పుగోదావరి జిల్లా డెల్టా ప్రాంతానికి చెందిన రైతు, గిరిజన ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న సాగునీటి సమస్యకు ఆయన కనిపెట్టిన హైడ్రో లిఫ్ట్ ర్యామ్ పంప్ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ అసాధారణ ఆవిష్కరణకు గుర్తింపుగా ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రైతు పేరు శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించారు.

చిన్న వాగు నుండి వేగంగా పొంగి పొరలే నీరు. ఆ ప్రవహించే నీటి శక్తినే ఉపయోగించి ఈ యంత్రం నిమిషానికి 30 నుంచి 40 లీటర్ల నీటిని లిఫ్ట్ చేసి ఎత్తైన ప్రాంతాలకు చేరవేస్తుంది. విద్యుత్ అవసరం లేదు.. ఇంధనం అవసరం లేదు.. ప్రకృతే దీని శక్తి. వరదలు వచ్చినా భయపడాల్సిన పనిలేదు. నీటి ఒత్తిడిని గుర్తించి ప్రత్యేకంగా రూపొందించిన ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోతాయి. అందుకే ఇది గిరిజన ప్రాంతాల వాగుల్లో కూడా సురక్షితంగా పనిచేస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇదే పరికరంతో దాదాపు 10 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

వీడియో చూడండి..

గ్రామాలకు వెలుగులు అందించడమే కాదు.. ధాన్యం, పసుపు వంటి ఉత్పత్తులను స్థానికంగానే ప్రాసెస్ చేయడానికి, తాగునీటిని శుద్ధి చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని శ్రీనివాస్ అంటున్నారు.. ఒక రైతు ఆలోచన.. ఒక గ్రామం కాదు, వేలాది గిరిజన కుటుంబాల జీవితాలను మార్చగల సాంకేతిక పరిష్కారంగా మారడంతోపాటు.. ఈ రైతు శ్రీనివాస్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు.. ఏ పనైనా చేయవచ్చు.. అనేలా శ్రీనివాస్ నిరుపించారని పలువురు ఆయన్ను అభినందిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *