Headlines

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ అగ్ని పరీక్షలో బుల్లితెర హీరోయిన్.. ఆ సూపర్ హిట్ సీరియల్‌కు గుడ్‌బై చెప్పేసిందా? | Podarillu Serial Actress Kruthika Umashankar Makes A Grand Entry In To Bigg Boss Agnipariksha 2

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ అగ్ని పరీక్షలో బుల్లితెర హీరోయిన్.. ఆ సూపర్ హిట్ సీరియల్‌కు గుడ్‌బై చెప్పేసిందా? | Podarillu Serial Actress Kruthika Umashankar Makes A Grand Entry In To Bigg Boss Agnipariksha 2


బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈ సారి రియాలిటీ షోలో మరిన్ని హంగులు, అదనపు ఆకర్షణలు ఉండనున్నాయి. అలాగే కంటెస్టెంట్స్ ఎంపిక, టాస్కులు, గేమ్స్ లో సరికొత్త రూల్స్ ను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా గత సీజన్ లాగే ఈ సీజన్ లోనూ సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లో స్థానం కల్పించనున్నారు. ఇందుకోసం అగ్ని పరీక్ష కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ‘బిగ్ బాస్’ అగ్నిపరీక్ష సీజన్ 2కు రంగం సిద్ధమైంది. ఆగస్టు 15వ తేదీ నుంచి షో మొదలు కానుంది. ఈసారి అగ్నిపరీక్షకు గట్టి పోటీ ఎదురైందని సమాచారం. వేలాదిగా వచ్చిన అప్లికేషన్స్ నుంచి 70 మందిని ఆడియన్స్‌కు పిలిచారు. అందులో నుంచి 15 మందిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా పేర్లే వినిపిస్తున్నాయి.
యాంకర్ ప్రియా, రాజ కుమారి డయానా, షాలిని పటేల్, ఆర్జే చరణ్, మిథిలేష్, శ్రష్ఠి వ్యాకర్ని, అమన్, హేమంత్, నవరసాలు ఆర్కే, రోహిత్, దీపక్, భాగీ తుళ్లూరి, మిస్ అపూర్వ, సింగర్ ఝాన్సీ.. ఇలా చాలా మంది అగ్ని పరీక్ష సీజన్ 2 కు ఎంపికయ్యారని నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి.

కాగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 జాబితాలో పొదరిల్లు సీరియల్ హీరోయిన్ మహాలక్ష్మి అలియాస్ అలియాస్ కృతిక ఉమా శంకర్ కూడా ఉందని తెలుస్తోంది. ఇలా ఆమె పేరు ప్రముఖంగా వినిపించడానికి ఒక ప్రధాన కారణం కూడా ఉంది. అదేంటంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతిక ఉమా శంకర్ బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 లో ఎంట్రీ అన్నట్లు ఒక ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. క్షణాల్లో ఈ ఫొటో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ మహాలక్ష్మి బిగ్ బాస్ లోకి వెళ్తుందా అని అనుకుంటున్నారు. మరి మహాలక్ష్మి నిజంగానే బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2కు వెళుతందా? లేదా జస్ట్ గెస్ట్ గా వెళుతుందా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ కృతిక బిగ్ బాస్ షోక వెళితే పొదరిల్లు సీరియల్ సంగతేంటి? అని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి



కృతిక ఉమాశంకర్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *