Headlines

Cinema : 1600 కోట్లు పెట్టి తీశారు.. వెయ్యి కోట్లు కూడా రాలేదు.. బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్.. కానీ ఓటీటీలో అదే నెంబర్ వన్.. | Know this Movie Biggest Disaster Of 2026, But Top Trending In Amazon Prime OTT, That Is he man and the masters of the universe

Cinema : 1600 కోట్లు పెట్టి తీశారు.. వెయ్యి కోట్లు కూడా రాలేదు.. బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్.. కానీ ఓటీటీలో అదే నెంబర్ వన్.. | Know this Movie Biggest Disaster Of 2026, But Top Trending In Amazon Prime OTT, That Is he man and the masters of the universe


ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేయడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని రిజల్ట్ అందుకుంటున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన పలు చిత్రాలు కనీసం పెట్టుబడి కూడా అందుకోవడం లేదు. కొన్నిసార్లు చాలా తక్కువ బడ్జెట్‌తో తీసిన చిన్న సినిమాలు థియేటర్లలో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుండగా, మరికొన్నిసార్లు భారీగా డబ్బు పెట్టి తీసిన పెద్ద బడ్జెట్ సినిమాలు థియేటర్లలో పూర్తిగా ఫ్లాప్ అవుతున్నాయి. 2026లో ఎంతో చర్చనీయమైన ఒక యాక్షన్-అడ్వెంచర్ చిత్రం విషయంలో ఇలాంటి ఒక దిగ్భ్రాంతికరమైన పరిస్థితి ఎదుర్కొంది. సోషల్ మీడియాలో హిట్‌గా నిలిచిన ఆ చిత్రం, థియేటర్లలో విడుదలయ్యాక పూర్తిగా పరాజయం పాలైంది. అయితే, ఓటీటీలోకి వచ్చాక అది సృష్టించిన అద్భుతానికి అందరూ నివ్వెరపోయారు. అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన హై-వోల్టేజ్ చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’. ఈ మూవీ కోసం నిర్మాతలు ఏకంగా రూ. 1626 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఈ సినిమా లాభాలు ఆర్జించాలంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ. 4000 నుండి 5000 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.

కానీ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 1090 కోట్లు మాత్రమే వసూలు చేసి, 2026లో అతిపెద్ద బాక్సాఫీస్ ఫ్లాప్‌గా నిలిచింది. సినీ విమర్శకుల ప్రకారం పాతబడిన కథాంశం, యువతరాన్ని చేరుకోవడంలో మార్కెటింగ్ బృందం విఫలమవడం, మితిమీరిన బడ్జెట్ ఈ పరాజయానికి ప్రధాన కారణాలు అని అంచనా వేశారు. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులలో 86% మంది , విమర్శకులలో 67% మంది దీని కథను, విజువల్ ఎఫెక్ట్స్‌ను ఎంతగానో ప్రశంసించారు.

సినిమా విడుదలైన కేవలం 47 రోజుల్లోనే, అంటే 2026 జూలై 22న, ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. ఈ నిర్ణయం రాత్రికి రాత్రే ఆ సినిమా తలరాతను మార్చేసింది. దీంతో ఓటీటీలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ట్రావిస్ నైట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, భూమిపై సాధారణ జీవితం గడుపుతున్న ‘ప్రిన్స్ ఆడమ్’ అనే బాలుడు తన స్వంత గ్రహమైన ‘ఎటర్నియా’కు ఎలా చేరుకుంటాడు, ‘హీ-మ్యాన్’ అనే భారీకాయుడిగా ఎలా మారతాడు మరియు క్రూరమైన విలన్ ‘స్కెలెటన్’తో ఎలా పోరాడతాడు అనే ఉత్కంఠభరితమైన కథను చెబుతుంది. ఈ చిత్రంలో నటుడు నికోలస్ గలిట్జైన్ ప్రిన్స్ ఆడమ్ పాత్రలో నటించగా, జారెడ్ లెటో ప్రధాన ప్రతినాయకుడి పాత్రను పోషించారుఓటీటీలోకి వచ్చిన వెంటనే, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నంబర్-1 స్థానంలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి



ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *