Headlines

Viral News: తల్లి, తమ్ముడిని హత్య చేసిన పారిపోయిన టీనేజర్.. ఛాట్‌జీపీటీ హిస్టరీలో సంచలనాలు! | Indian Origin Teen Arjun Aravind Charged with Murder of Mother and Brother in America

Viral News: తల్లి, తమ్ముడిని హత్య చేసిన పారిపోయిన టీనేజర్.. ఛాట్‌జీపీటీ హిస్టరీలో సంచలనాలు! | Indian Origin Teen Arjun Aravind Charged with Murder of Mother and Brother in America


తన ఫ్యామిలీని ఎలా చంపాలో అని చాట్‌జీపీటీ సలహా తీసుకొని ఓ యువకుడు.. తన తల్లి, తమ్ముడిని హత్య చేసిన ఘటన అమెరికాలోని మాసాచుసెట్స్ రాష్ట్రం, ఆక్టన్ సబర్బన్ ప్రాంతంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల అర్జున్ అరవింద్ తన ఫ్యామిలీతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. అయితే మంగళవారం మార్నింగ్ అర్జున్ తండ్రి పనిమీద బయటకు వెళ్లడంతో ఇంట్లో తన తల్లి సుధా వేంకటేశన్ (45), తమ్ముడు సిద్ధార్థ్ అరవింద్ (14) మాత్రమే ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ అర్జున్ తన తల్లితో పాటు, తమ్ముడిని అతి దారుణంగా హత్య చేసి.. తర్వాత తన తల్లికారుతో అక్కడి నుంచి పారిపోయాడు.

అయితే అదే రోజు సాయంత్రం అర్జున్ తమ్ముడికి ట్యూషన్ చెప్పడానికి వచ్చిన ఒక టీచర్ ఇల్లు లాక్ చేసి ఉండడాన్ని చూసి అర్జున్ తండ్రికి ఫోన్ చేసింది. దీంతో అతను తన భార్యాపిల్లలను సుధా ఫోన్‌కు కాల్ చేయగా ఆమె లిఫ్ట్‌ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన అతను.. వెంటనే ఆక్టన్ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. డోర్స్ బద్దల కొట్టి లోపలికి వెళ్లగా.. హాల్‌లో సుధా వెంకటేషన్, ఫస్ట్ ఫ్లోర్‌లో సిద్ధార్థ్ విగత జీవులుగా పడి ఉండడం గమనించాడు. రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రాథమిక ఆధారాల ప్రకారం.. అర్జునే ఈ ఘాతుకానికి పాల్పడిన తల్లి కారు తీసుకొని పారిపోయినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రాత్రంతా అతని కోసం గాలించి బుధవారం తెల్లవారుజామున వేలాండ్ ప్రాంతంలోని ఒక పార్కింగ్ స్థలంలో ఉన్న కారులో అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అత్యకు గల కారణాలపై ఆరా తీయడం స్టార్ట్ చేశారు.

ఛాట్‌జిపిటి సెర్చ్‌ హిస్టరీలో సంచలనాలు

అయితే కేసు దర్యాప్తులో భాగంగా అతని సెర్చింగ్ టేటాను పరిశీలించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. అర్జున్ గత కొంత కాలంగా వింతగా ప్రవర్తిస్తున్నాడని, కుటుంబ సభ్యులను ఎలా అంతం చేయాలని “ChatGPT” AI టూల్‌ను సలహాలు అడిగినట్టు అధికారులు గుర్తించారు. అనంతరం అతనిపై రెండు హత్య చేసులు నమోదు చేసి లోవెల్ జువైనల్ కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధమయ్యారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *