Headlines

బిగ్ బాస్10లోకి సోషల్ మీడియా సెన్సేషన్.. ఈ క్రేజీ యాంకరమ్మ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందా.? | Is social media sensation and anchor RJ Charmilla entering Bigg Boss 10 telugu

బిగ్ బాస్10లోకి సోషల్ మీడియా సెన్సేషన్.. ఈ క్రేజీ యాంకరమ్మ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందా.? | Is social media sensation and anchor RJ Charmilla entering Bigg Boss 10 telugu


బిగ్ బాస్ సీజన్ 10కోసం ఇప్పుడు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 10 మొదలు కానుంది. ఇప్పటికే అగ్నిపరీక్ష ద్వారా సామాన్యులను సెలక్ట్ చేసే పనిలో పడ్డారు. ఇక ఇప్పటికే అగ్నిపరీక్ష ద్వారా కొందరు సామాన్యులను సెలక్ట్ చేశారని తెలుస్తుంది. ఈసారి బిగ్ బాస్ గేమ్ షో మరింత ఆసక్తికరంగా ఉండనుంది. బిగ్ బాస్ దశావతారం పేరుతో బిగ్ బాస్ 10 నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సారి హౌస్ లో సెలబ్రేటీస్, కామనర్స మధ్య ఆసక్తికర పోరు ఉండేలా కనిపిస్తుంది. ఈనెల 15 న అగ్నిపరీక్ష మొదలు కానుంది. అలాగే వచ్చే నెలలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొదలు కానుంది.

ఇది కూడా చదవండి: అమ్మబాబోయ్..! మేడం ఇది మీరేనా..!! సింధుతులాని ఇప్పుడు ఎంత మారిపోయింది

కాగా బిగ్ బాస్ సీజన్ 10 కోసం ఈసారి కొంతమంది సెలబ్రెటీలు ఎంపిక చేశారని తెలుస్తుంది. కొంతమంది సెలబ్రెటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, జబర్దస్త్ కమెడియన్ల పేర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, రాకింగ్ రాకేష్, వర్ష, పవిత్ర, వర్షిణి, నందూస్ వరల్డ్ నందు, చంద్రహాస్, జ్యోతి, రాయల్ ఎంసీ రమణ, హీరో అబ్బాస్ వంటి పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పుడీ జాబితాలో మరో పేరు చేరింది.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి :అయ్యో.. ఫోన్ ఎంతపని చేసింది..!! హాస్పటల్ పాలైన అందాల నటి.. కారణం తెలిస్తే షాక్ ఆడుతారు

ఆమె మరెవరో కాదు కొన్ని రోజుల క్రితం కొన్ని రోజుల క్రితం వైరల్ అయిన యాంకర్ ఆర్జే చర్మిల. ఆమె అసలు పేరు చర్మిల నల్లూరి. ఇటీవల కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యాంకర్ గా హోస్ట్ చేసింది ఈ చిన్నది. ఆ ఈవెంట్ లో తన క్యూట్ మాటలు అందంతో కట్టిపడేసింది. ఈ ఈవెంట్ లో ఆమె అందానికి ఫిదా అయిన అల్లు అరవింద్ ఆమెకు స్టేజ్ పైనే హీరోయిన్ గా నటిస్తావా.? అని ఛాన్స్ ఇచ్చారు. విజయవాడ రెడ్ ఎఫ్ఎమ్లో ఆర్జేగా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు యాంకర్ గా రాణిస్తుంది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు బిగ్ బాస్ 10 ఆఫర్ వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అంతా సెట్ అయితే ఈ అమ్మడు బిగ్ బాస్ 10లో కనిపిస్తుందని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ఇది కూడా చదవండి :జెన్ జీలకు తెగ నచ్చేసిన సినిమా ఇదే.. ఒక్కసారి చూస్తే మీరూ వదిలిపెట్టారు.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *