Headlines

ఆయనతో కలిసి 15 సినిమాలు చేశా.. బయటపెద్దగా మాట్లాడుకోము : జయసుధ | Veteran actress Jayasudha Intresting comments about Prakash raj

ఆయనతో కలిసి 15 సినిమాలు చేశా.. బయటపెద్దగా మాట్లాడుకోము : జయసుధ | Veteran actress Jayasudha Intresting comments about Prakash raj


తెలుగు సినీ పరిశ్రమలో సహజ నటిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్ జయసుధ, తల్లి పాత్రల్లో నటిస్తూ తనదైన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు జయసుధ. ఓ ఇంటర్వ్యూలో ఆమె  తన సుదీర్ఘ సినీ ప్రయాణం, సహ నటులతో అనుభవాలు, వ్యక్తిగత వృత్తిపరమైన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్ తొలి రోజుల నుంచి ప్రస్తుత తరం నటుల వరకు ఎందరో దిగ్గజాలతో కలిసి పనిచేసిన తీరును ఆమె గుర్తు చేసుకున్నారు. జయసుధ కృష్ణ గారు చాలా అందమైన వ్యక్తి అని, తాను ఆయనకు పెద్ద అభిమానినని పేర్కొన్నారు. అయితే, తన కృష్ణగారు తన అంకుల్ అవ్వడం వల్ల కొంత భయం, దూరం ఉండేదని తెలిపారు. శోభన్ బాబు అందంగా ఉండటమే కాకుండా, ఆకర్షణీయమైన వ్యక్తి అని, ఆడవారితో ఎలా మాట్లాడాలో బాగా తెలిసిన వ్యక్తి అని ప్రశంసించారు. ఆయన దగ్గర హీరోయిన్లు తమ వ్యక్తిగత సమస్యలను కూడా పంచుకునేవారని, ఆయన మంచి సలహాలు ఇచ్చేవారని వివరించారు.

ఇది కూడా చదవండి : అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ అయ్యాడు..! పెద్ద హీరో అయ్యుండి కూడా నా కాళ్లు పట్టుకున్నాడు

ఎన్టీఆర్ వంటి గొప్ప నటులతో తాను 14, 15 సంవత్సరాల వయసులోనే నటించడం మొదలుపెట్టానని, అప్పట్లో ఆయన పెద్దరికం వల్ల ఒకరకమైన భయం ఉండేదని అన్నారు. తొలిరోజుల్లో ఇంటిమేట్ సీన్స్‌లో నటించడం, ప్రేమ డైలాగులు చెప్పడం తనకు ఇబ్బందిగా అనిపించేదని గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రస్తుత తరం నటులలో ప్రకాష్ రాజ్‌తో తన కెమిస్ట్రీ గురించి మాట్లాడుతూ, “మేము బయట చాలా తక్కువ మాట్లాడుకుంటాం. హాయ్, బై అంతే. కానీ తెరపై మా ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా పండుతుంది,” అని ఆమె అన్నారు.

ఇది కూడా చదవండి : శ్రీదేవితో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.? 90’స్ కిడ్స్ ఫేవరెట్ హీరోయిన్ ఆమె.. ఇప్పటికీ అదే అందం

“బొమ్మరిల్లు”, “అమ్మానాన్న తమిళమ్మాయి”, “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”, “శతమానం భవతి” వంటి చిత్రాలను ప్రస్తావిస్తూ, ముఖ్యంగా “శతమానం భవతి”లో భార్యాభర్తలుగా వారి నటన ఎన్నో ఏళ్లుగా కాపురం చేసిన దంపతులనే భావనను కలిగించిందని అన్నారు. తాను పాత్రలో లీనమైపోతానని, ప్లాన్ చేసుకుని నటించనని, అందుకే ఆ కెమిస్ట్రీ సహజంగా పండిందని వివరించారు. అలాగే జయసుధ తన కెరీర్ తొలి దశలో విజయశాంతి రాకముందు, శ్రీదేవి, జయప్రద వంటి నటీమణులు ఉన్నప్పటికీ, “సీతారామ మ్యాగజైన్” వంటి పత్రికల సర్వేలలో మూడు సార్లు “సూపర్ స్టార్”గా ఎంపికయ్యారని గుర్తు చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులు గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఇస్తారని, తనను సూపర్ స్టార్‌గా ఎంచుకోవడం ద్వారా వారు ఈ విషయాన్ని నిరూపించారని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *