Headlines

Hero Honda: హీరో, హోండా ఎందుకు విడిపోయాయి? 26 ఏళ్ల అనుబంధం వెనుక ఇంత కథ ఉందా? | Hero Honda Split: Why Indias Iconic Two Wheeler Partnership Ended After 26 Years

Hero Honda: హీరో, హోండా ఎందుకు విడిపోయాయి? 26 ఏళ్ల అనుబంధం వెనుక ఇంత కథ ఉందా? | Hero Honda Split: Why Indias Iconic Two Wheeler Partnership Ended After 26 Years


Hero Honda: ఒకప్పుడు భారతదేశపు ద్విచక్ర వాహన మార్కెట్‌లో హీరో హోండా తిరుగులేని పేరుగా నిలిచింది. స్ప్లెండర్, సీడీ100 వంటి మోడళ్లతో కోట్లాది మంది భారతీయులకు కేవలం వాహనాలను మాత్రమే కాకుండా, ఒక నమ్మకాన్ని, చిరునవ్వును అందించింది. 1984లో ప్రారంభమైన ఈ విజయవంతమైన 26 సంవత్సరాల భాగస్వామ్యం, 2011లో ముగియడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక వ్యాపార విభజన మాత్రమే కాదు, రెండు సంస్థల ఆశయాలు, దృష్టికోణాల మధ్య జరిగిన ఘర్షణకు ప్రతిబింబం. వివిధ కథనాల ప్రకారం భారతీయ వాహన దిగ్గజం విడిపోవాడనికి అనేక కారణాలు ఉన్నాయి.

భాగస్వామ్యం పుట్టుక: ఒక అవసరం నుండి ఆవిష్కరణ వరకు..

హీరో కంపెనీ ప్రస్థానం 1956లో బ్రిజ్మోహన్ లాల్ మంజల్ చేత సైకిళ్ల తయారీతో మొదలైంది. 1975 నాటికి దేశంలోనే అతిపెద్ద సైకిల్ తయారీదారుగా ఎదిగిన హీరో, విదేశాల్లో మోటార్‌సైకిళ్ల వినియోగాన్ని గమనించింది. భారతదేశంలోనూ మోటార్‌సైకిళ్లను అందుబాటులోకి తీసుకురావాలని మంజల్ ఆశించినప్పటికీ, సరైన ఇంజిన్ టెక్నాలజీ లేకపోవడం పెద్ద సవాలుగా మారింది. అదే సమయంలో జపాన్‌కు చెందిన హోండా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా తన మోటార్‌సైకిల్ వ్యాపారాన్ని విస్తరిస్తోంది. అప్పట్లో భారత ప్రభుత్వం విదేశీ కంపెనీలు నేరుగా దేశంలోకి ప్రవేశించి వ్యాపారం చేయకుండా కొన్ని ఆంక్షలు విధించింది. దీంతో హోండా కూడా భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఒక భారతీయ భాగస్వామి కోసం చూస్తోంది. ఈ పరిస్థితులు హీరో, హోండాలను ఒకచోట చేర్చాయి. 1984లో హర్యానాలో ఒక అగ్రిమెంట్‌తో ఈ భాగస్వామ్యం మొదలైంది.

ఇది కూడా చదవండి: Asha Chocolate: ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ‘ఆశ చాక్లెట్’ ఇప్పుడు ఎందుకు కనుమరుగైపోయింది? అసలు కారణాలివే!

అగ్రిమెంట్ షరతులు, ప్రారంభ విజయాలు:

ఈ ఒప్పందం ప్రకారం, హీరో కంపెనీ బైక్ బాడీ పార్ట్స్‌ను తయారు చేయగా, హోండా ఇంజిన్ టెక్నాలజీని అందించాలి. అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, హోండా కంపెనీ భవిష్యత్తులో ఎప్పుడూ హీరో హోండాకు పోటీగా భారతదేశంలో ఎటువంటి ద్విచక్ర వాహనాలనూ విడుదల చేయకూడదు. ఈ ఒప్పందంతో 1985లోనే సీటీ 100 అనే పేరుతో తమ మొదటి బైక్‌ను విడుదల చేశారు. “ఫిల్ ఇట్, షట్ ఇట్, ఫర్గాట్ ఇట్” అనే ట్యాగ్‌లైన్‌తో ఇది ప్రజల్లోకి దూసుకుపోయింది. 1994లో స్ప్లెండర్ లాంచ్ కావడంతో హీరో హోండా ఖ్యాతి పరాకాష్టకు చేరింది. స్ప్లెండర్ కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, మధ్యతరగతి కుటుంబాల ఆశలకు, కలలకు ప్రతీకగా నిలిచింది.

సంక్షోభాలు, అంతర్గత ఘర్షణలు:

విజయం వెనుక కొన్ని సమస్యలు పొంచి ఉన్నాయి. జపాన్ యెన్ విలువ పెరగడంతో జపాన్ నుండి దిగుమతి చేసుకునే ఇంజిన్ల ధరలు పెరిగి, హీరో హోండా లాభాలు తగ్గాయి. సుజుకి, యమహా, బజాజ్, టీవీఎస్ వంటి పోటీదారులు మార్కెట్‌లోకి ప్రవేశించారు. అయినప్పటికీ హీరో హోండా సరసమైన ధరలను కొనసాగించి, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని, కొన్ని నష్టాలను భరిస్తూనే ముందుకు సాగింది. అయితే, బయట కనిపించినంత అందంగా, బలమైనదిగా ఈ భాగస్వామ్యం అంతర్గతంగా లేదు.

ఇది కూడా చదవండి: మొక్క జొన్న ఉడకబెట్టి తినడం మంచిదా? కాల్చి తినడం మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

విడిపోవడానికి ప్రధాన కారణాలు:

1. టెక్నాలజీ ఆధారపడటం: హీరో కంపెనీ ఇంజిన్ టెక్నాలజీ కోసం హోండాపై పూర్తిగా ఆధారపడాల్సి వచ్చింది. ఇది హీరోకు సొంత ఆవిష్కరణలు చేయడానికి అడ్డంకిగా మారింది. హోండా టెక్నాలజీని ఇవ్వడం ద్వారానే కాకుండా భారతదేశంలో తమకు పోటీ ఉండకూడదనే షరతుతో లాభపడింది.

2. గ్లోబల్ ఆశయాలు: హోండా ఇప్పటికే అమెరికా, రష్యా వంటి దేశాల్లో మోటార్‌సైకిళ్లను అమ్ముతూ ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. కానీ, అగ్రిమెంట్‌లోని NOC కారణంగా హీరో హోండా కేవలం భారతదేశానికే పరిమితమైంది. హీరో కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించాలని ఆశించినా, ఈ ఒప్పందం దానికి అడ్డుపడింది. ఇది హీరో గ్రోత్ అవకాశాలను పరిమితం చేసింది.

3. రాయల్టీ చెల్లింపుల వివాదాలు: హోండా తమ టెక్నాలజీకి భారీ మొత్తంలో రాయల్టీని డిమాండ్ చేసింది. హీరో కంపెనీకి ఇది ఆర్థిక భారం, తక్కువ మార్జిన్‌లకు దారితీసింది. రాయల్టీ రేట్లలో తేడాలు, చెల్లింపుల పద్ధతులపై రెండు కంపెనీల మధ్య తరచూ విభేదాలు తలెత్తాయి.

4. విభిన్న దృష్టికోణాలు: కాలక్రమేణా, రెండు కంపెనీల భవిష్యత్తు దృష్టికోణాలలో గణనీయమైన తేడాలు వచ్చాయి. హీరో భారతదేశ మార్కెట్‌పై దృష్టి సారించి, అందుబాటు ధరలకు వాహనాలను అందించాలని ఆశించగా, హోండా ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం ఉత్పత్తులు, అధునాతన టెక్నాలజీతో మార్కెట్ లీడర్‌గా ఎదగాలని కోరుకుంది.
ఈ కారణాలన్నీ కలిసి, చివరికి 2011లో హీరో, హోండా తమ 26 ఏళ్ల భాగస్వామ్యానికి స్వస్తి పలికాయి. ఆ తర్వాత హీరో, హీరో మోటోకార్ప్‌గా మారి, సొంతంగా ఇంజిన్లను అభివృద్ధి చేసుకుని, గ్లోబల్ మార్కెట్‌లో విస్తరించింది. హోండా కూడా భారతదేశంలో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) పేరుతో తన వ్యాపారాన్ని కొనసాగించింది. ఈ విభజన రెండు సంస్థలకు కొత్త దిశలను చూపింది. కానీ హీరో హోండా సృష్టించిన వారసత్వం మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: అంబానీ నిర్మించిన ఇంటి స్థలం ఎవరిదో తెలుసా? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *