Headlines

Meghamsh Srihari: శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ | Meghamsh Srihari New Movie First Look Released On Srihari Birth Anniversary Special

Meghamsh Srihari: శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ | Meghamsh Srihari New Movie First Look Released On Srihari Birth Anniversary Special


నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన సినిమాలు చేసి తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాందించుకున్న లెజెండరీ నటుడు రియల్‌స్టార్‌ డా. శ్రీహరి. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా భైరవకాళి బ్యానర్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. లెల్లా రోహిత్‌ దర్శకత్వంలో లెల్లా రాహుల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిలో బాగమైన పోతురాజు ఆహార్యంలో ఉన్న హీరో ఫస్ట్ లుక్ నీ ఆగస్టు 15న (రేపు) శ్రీ హరి గారి పుట్టిన రోజు సందర్బంగా ఇవాళ (ఆగస్టు 14) చిత్ర బృందం విడుదల చేసింది. ఈ లుక్‌లో తనయుడు మేఘాంశ్‌ శ్రీహరికి అండగా వెనుక పోతురాజు ఆహార్యంలో రియల్‌స్టార్‌ డా. శ్రీహరికి కూడా కనిపిస్తుండటంతో ఈ లుక్‌ మరింత పవర్‌ఫుల్‌గా మారింది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, శరవేగంగా ముస్తాబవుతోంది, త్వరలో చిత్ర బృందం ఇండియాస్ బిగ్గెస్ట్ టైటిల్ గ్లింప్స్ రివీలింగ్ ఈవెంట్ జరగబోతుందని ప్రకటించింది. ఈ ఈవెంట్ ద్వారా సినిమాలో హీరోకు సంబంధించిన ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు.మిగిలిన వివరాలు త్వరలో ప్రకటించబడతాయని చిత్ర బృందం తెలిపింది.

మేఘాంశ్ శ్రీహరి చేతిలో ప్రస్తుతం ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. ఇటీవలే అతను హీరోగా నటించిన స్టూడెంట్ అనే సినిమా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. అలాగే ఆస్మాన్ అనే ఓ కొత్త సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే మరో కొత్త సినిమాను ప్రకటించాడు మేఘాంశ్. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి



త్వరలోనే మరిన్ని అప్డేట్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *