గత కొన్నేళ్లుగా వరుస అపజయాలు ఎదుర్కొంటోన్న మెగా హీరో వరుణ్ తేజ్ కు కొరియన్ కనకరాజు రూపంలో బిగ్ రిలీఫ్ లభించింది. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ లో రితికా నాయర్ హీరోయిన్ గా చేసింది. కమెడియన్ సత్య మరో కీలక పాత్రలో మెరిశాడు. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. వరుణ్ సినిమా విజయంతో నాగబాబు కూడా సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఇక వరుణ్ కుమారుడు వాయువ్ తేజ్ లక్కీఛార్మ్ అని, కొరియన్ కనకరాజు సినిమా సక్సెస్ క్రెడిట్ కూడా వాయువ్ తేజ్ కే దక్కుతుందని చిరంజీవి సరదాగా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు వరుణ్ కుమారుడికి సంబంధించిన ఫొటోలు పెద్దగా బయటకు రాలేదు. దీంతో ఈ మెగా ప్రిన్స్ వారసుడిని చూడాలని మెగాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫొటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన మనవడు, వరుణ్ తేజ్ కుమారుడు వాయువ్ తేజ్ ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు మెగా బ్రదర్.
ఈ ఫొటోలో వాయువ్ తన తాతలు నాగబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసి ఉన్న ఫొటోను ఎంతో ఆసక్తిగా చూస్తూ కనిపించాడు. ఈ ఫొటోకు నాగబాబు పెట్టిన క్యాప్షన్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘మా బుజ్జిబాబు చరిత్రను తదేకంగా చూస్తున్నాడు.. ఆ కళ్లలో చెప్పని కథలు ప్రతిబింబిస్తున్నాయి. తన అద్భుతమైన పరిశీలనతో మెగా వారసత్వం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చారు నాగబాబు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మెగాభిమానులు ఈ ఫొటోను చూసి తెగ మురిసిపోతున్నారు. వరుణ్ కుమారుడు చాలా క్యూట్ గా ఉన్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నాగబాబు షేర్ చేసిన ఫొటో ఇదే..
కాగా వరుణ్ తేజ్, లావణ్యలది ప్రేమ వివాహం. పెద్దల సమక్షంలో 2023లో వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది ఇటలీ వేదికగా పెళ్లిపీటలెక్కారు. తమ పండంటి కాపురానికి ప్రతీకగా గత ఏడాది సెప్టెంబర్ లో వరుణ్-లావణ్యలకు వాయువ్ తేజ్ జన్మించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.