దశాబ్దాలు గడుస్తున్నా, అదే క్రేజ్‌ని, అదే చరిష్మాను కాపాడుకుంటూ వస్తున్న స్టార్ హీరోయిన్ కాజోల్ ఇప్పుడు రూటు మారుస్తున్నారు. మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా తాను కూడా అప్డేట్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. తన లైన్స్ క్రాస్ చేయకుండానే కొత్త జానర్లో అడుగులు వేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతకీ కాజోల్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి..? ముప్పై నాలుగు ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణం కాజోల్ సొంతం. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హై లాంటి ఎవర్ గ్రీన్ సినిమాలతో భారతీయ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారామె. కమర్సియల్ సినిమాల్లోనూ నటించినా… నటిగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రజెంట్ సినిమా మేకింగ్, నుంచి ఆడియన్స్ టేస్ట్ వరకు అన్ని మారిపోవటంతో కాజోల్ కూడా రూటు మార్చాలని ఫిక్స్ అయ్యారు. వచ్చిన ప్రతీ సినిమా చేయకుండా… సెలెక్టివ్‌గా ఉండాలని ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా ప్రతీ సినిమాలో ఏదైనా కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాదు ఇకపై ప్రయోగాలకు సిద్ధమని, ఇంతవరకు చేయని పాత్రల్లో కనిపించాలని అనుకుంటున్నానని మనసులో మాట బయటపెట్టారు. థియేటర్లకే పరిమితం కాకుండా, డిజిటల్ మీడియంలోనూ సత్తా చాటుతున్నారు కాజోల్. త్రిభంగ, ది ట్రయల్ లాంటి ప్రాజెక్టులతో ఓటీటీలో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. తనకు సూట్ అవ్వదు అనుకుంటే, ఎంత మంచి క్యారెక్టర్ అయినా… ఎంత భారీ సినిమా అయినా.. మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nani: ఆసక్తికరంగా నాని హీరోయిన్స్ సెలక్షన్
Shraddha Srinath: మూడు భాషల్లో హిట్లు.. అయినా అవకాశాలు కరువు! శ్రద్ధా శ్రీనాథ్ కెరీర్‌కు ఏమైంది?
Ritika Nayak: వరుస హిట్లతో టాలీవుడ్లో గోల్డెన్ హ్యాండ్‌గా మారిన యంగ్ బ్యూటీ.. ఎవరో తెలుసా?
Dhurandhar: థియేటర్లలో వేల కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ వరల్డ్ రికార్డ్! ‘ధురంధర్’ దుమ్మురేపుతోంది
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!