భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్ట్ శనివారం గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమైంది. అయితే ఇదే రోజు స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జాతీయ జెండాను ఎగురవేయగా, ఆటగాళ్లు, సిబ్బంది జాతీయ గీతం ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు.
వీడియో చూడండి
On the occasion of Independence Day, #TeamIndia gathered at Galle to hoist the Tricolour 🇮🇳 ahead of the First #SLvIND Test.#IndependenceDay pic.twitter.com/tHKIggV6AU
— BCCI (@BCCI) August 15, 2026
భారత్‌కు ఇది 600వ టెస్ట్ మ్యాచ్
మరో ప్రత్యేకత ఏంటంటే గాలేలో జరుగుతున్న ఈ మ్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైనది. ఇది టీమిండియా ఆడుతున్న 600వ టెస్ట్ మ్యాచ్. భారత్ 1932లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో తొలి టెస్ట్ ఆడింది. దాదాపు 94 ఏళ్ల ప్రయాణం తర్వాత 600 టెస్టుల మైలురాయిని చేరుకుంది. 600కు పైగా టెస్టులు ఆడిన జట్ల జాబితాలో భారత్ కంటే ముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి. దీంతో శ్రీలంకతో గాలే టెస్ట్ భారత క్రికెట్ చరిత్రలో మరో ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది.
టాస్ గెలిచిన గిల్.. తొలుత బ్యాటింగ్
మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాలే పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మొదట భారీ స్కోరు సాధించి శ్రీలంకపై ఒత్తిడి పెంచాలని టీమిండియా భావించింది. ఈ సిరీస్ భారత జట్టుకు ముఖ్యమైనదిగా మారింది. కొత్త తరం ఆటగాళ్లతో గిల్ నాయకత్వంలో భారత్ టెస్ట్ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది.
తుది జట్టులో జడేజా.. పడిక్కల్‌కు అవకాశం
తొలి టెస్టు కోసం టీమిండియా తుది జట్టులో రవీంద్ర జడేజా తిరిగి చోటు దక్కించుకున్నాడు. 2026 జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌కు భారత జట్టులో జడేజాను ఎంపిక చేయకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు శ్రీలంకతో సిరీస్ ద్వారా అతను మళ్లీ టెస్ట్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు దేవదత్ పడిక్కల్‌కు కూడా తుది జట్టులో అవకాశం లభించింది. అతను చివరిసారిగా 2024 నవంబర్‌లో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌పై ముల్లన్‌పూర్‌లో అర్ధ సెంచరీ చేసిన సాయి సుదర్శన్ గాయపడటంతో అతని స్థానంలో పడిక్కల్‌ను ఎంపిక చేశారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి