వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో అరుదైన పాము ఒకటి ప్రత్యక్షమైంది. అశోక్ నగర్ గ్రామ శివారులో కనిపించిన ఈ పాము అత్యంత విషపూరితమైన, అరుదైన ‘బాండెడ్ క్రైట్’పాముగా గుర్తించారు. నలుపు, పసుపు చారలతో సుమారు 5 అడుగుల పొడవున్న ఈ పామును చూసి స్థానికులు మొదట బొమ్మ అనుకుని భ్రమపడ్డారు. అయితే దాని కదలికలను గమనించి ఉలిక్కిపడి, వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ సంఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా పామును బంధించారు. అనంతరం దాన్ని పాకాల అడవుల్లో సురక్షితంగా విడిచిపెట్టారు. తెలంగాణ అడవుల్లో ఈ జాతి పాము ప్రత్యక్షం కావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. చైనా, నేపాల్, థాయిలాండ్ తదితర దేశాలతో పాటు మన దేశంలోని కొన్ని రాష్ట్రాలలో మాత్రమే సంచరించే ఈ పాము.. బహుశా లారీల్లో లేదా ఇతర మార్గాల ద్వారా ఇక్కడికి చేరి ఉంటుందని భావిస్తున్నారు. ఈ పాము కాటుకు గురైతే ప్రాణాలు దక్కడం అసాధ్యమని వెటర్నరీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రివేళల్లో సంచరించే ఈ అరుదైన పాములు కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలని, వాటిని చంపవద్దని ప్రజలకు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్‌పై ఎన్ఈసీసీ సంచలన నివేదిక!
10వ తరగతి అర్హతతో రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక!
నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!
Google Drive: గూగుల్ డ్రైవ్ వాడేవారికి అలర్ట్.. ఫొటోల బ్యాకప్ విషయంలో కీలక మార్పులు
Monsoon Update: పసిఫిక్‌లో ఎల్‌నినో సెగ.. భారత్‌లో నిలకడగా రుతుపవనాలు.. కరువు భయం లేనట్లే!